Double Dhamaaka! నటసింహ నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సస్ సాధించిన విషయం తెలిసిందే. ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా.. ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేయడం విశేషం. ఈ సినిమా ఇచ్చిన విజయోత్సాహంతో నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు. బాలయ్య తదుపరి చిత్రాన్ని క్రాక్ మూవీతో సక్సెస్ సాధించిన మలినేని గోపీచంద్ డైరెక్షన్ లో చేయనున్నారు.
ఈ క్రేజీ, భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. ఆమధ్య పూజా కార్యక్రమాలతో ఈ సినిమా చాలా గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో బాలయ్య సరసన శృతిహాసన్ నటిస్తుంది. భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అది ఏంటంటే.. ఇందులో బాలయ్య రెండు డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నారట.
ఈ రెండు పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయని.. ఒక పాత్ర అరవై ఏళ్ల ఓల్డ్ గెటప్ లో కనిపిస్తుందని సమాచారం. అంతే కాకుండా.. ఈ క్యారెక్టర్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకాభిమానులను విశేషంగా ఆకట్టుకుంటాయని అంటున్నారు. బాలయ్య బ్లాక్ బస్టర్ అఖండ తర్వాత వస్తున్న సినిమా కావడం… క్రాక్ సక్సస్ తర్వాత మలినేని గోపీచంద్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం.. ఇది యదార్థ సంఘటనలు ఆధారంగా రూపొందుతోన్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి…. బాలయ్య ఈ సినిమాతో ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.