Saturday, April 20, 2024
Homeసినిమాసుకుమార్ తో కోలీవుడ్ స్టార్ హీరో మూవీ?

సుకుమార్ తో కోలీవుడ్ స్టార్ హీరో మూవీ?

Sukku on Demand: క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘పుష్ప‌’. ఈ చిత్రం బ‌న్నీ, సుక్కు.. ఇద్ద‌రికీ ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ. దీంతో పుష్ప సినిమా నార్త్ ఆడియ‌న్స్ ని ఎంత వ‌ర‌కు మెప్పిస్తుంది.?   బాలీవుడ్ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఏ రేంజ్ స‌క్స‌స్ సాధిస్తుంది అనుకుంటే… అంచ‌నాల‌కు మించిన విజయం సాధించి బాలీవుడ్ సినీ పండితుల‌ను సైతం షాక్ కి గురి చేసింద‌ని చెప్ప‌చ్చు. ఆ రేంజ్ కలెక్ష‌న్స్ ను వ‌సూలు చేసింది. దీంతో డైరెక్ట‌ర్ సుకుమార్ కి డిమాండ్ బాగా పెరిగింది.

దీంతో సుకుమార్ తో సినిమా చేయ‌డానికి అన్ని భాష‌ల హీరోలు ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. ఓ బాలీవుడ్ హీరో సుకుమార్ తో సినిమా చేయాలి అనుకుంటున్నారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా సుకుమార్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అలాగే కోలీవుడ్ స్టార్ హీరో కూడా సుకుమార్ తో ఓ సినిమా చేయబోతున్నాడనే వార్తలు వ‌స్తున్నాయి. ఆ కోలీవుడ్ స్టార్ హీరో మరెవరో కాదు ధనుష్.

ధ‌నుష్ టాలీవుడ్ యంగ్ డైరెక్ట‌ర్ వెంకీ అట్లూరితో సార్ అనే సినిమా చేస్తున్నాడు. అలాగే టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ కమ్ముల‌తో కూడా ధ‌నుష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు సుకుమార్ తో కూడా ధ‌నుష్ సినిమా చేయ‌నున్నార‌ని.. ఈ మూవీ ఆల్రెడీ ఫిక్స్ అయ్యింద‌ని గ‌ట్టిగానే వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే… సుకుమార్ పుష్ప 2 చేయాలి. ఆత‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో సినిమా చేయాలి. అలాగే ధ‌నుష్  తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు క‌మిట్ అయ్యాడు. ఇవ‌న్నీ పూర్తైన త‌ర్వాత… ధ‌నుష్, సుకుమార్ కాంబినేష‌న్ మూవీ సెట్స్ పైకి రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

RELATED ARTICLES

Most Popular

న్యూస్