Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Pushpa in Bollywood:
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించింది. ఈ భారీ చిత్రం డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. బ‌న్నీ, సుక్కు.. ఇద్ద‌రికీ ఇదే ఫ‌స్ట్ పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ‘పుష్ప‌’ నార్త్ ఆడియ‌న్స్ ని ఎంత వ‌ర‌కు మెప్పిస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది. అయితే.. తెలుగుతో పాటు హిందీలో కూడా మంచి క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేస్తుండ‌డం విశేషం.

హిందీ వెర్షెన్ పుష్ప మొద‌టి రోజు 3.11 కోట్లు, రెండో రోజు 3.55 కోట్లు, మూడ‌వ రోజు 5.18 కోట్లు, నాలుగ‌వ రోజు 4.25 కోట్లు క‌లెక్ట్ చేసింది. టోట‌ల్ గా నాలుగు రోజుల‌కు 16.09 కోట్లు క‌లెక్ట్ చేసింది. ఇలా.. నార్త్ లో రోజురోజుకు క‌లెక్ష‌న్స్ పెరుగుతూ బాక్సాఫీస్ వ‌ద్ద‌ దూసుకెళుతుంది. ఫుల్ ర‌న్ లో హిందీ వెర్సెన్ దాదాపుగా 50 కోట్ల‌కుపైగా క‌లెక్ట్ చేస్తుంద‌ని ట్రేడ్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో ఫుల్ ర‌న్ లో ‘పుష్ప‌’ వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎంత క‌లెక్ట్ చేస్తుంది అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read : తిరుప‌తిలో.. ‘పుష్ప’ మాసీవ్ సక్సెస్ పార్టీ

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com