Sunday, November 24, 2024
Homeస్పోర్ట్స్జపాన్ ప్రేక్షకులకు అనుమతి?

జపాన్ ప్రేక్షకులకు అనుమతి?

ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ ను  ప్రత్యక్షంగా వీక్షించేందుకు తమ పౌరులను అనుమతించాలని జపాన్ ప్రభుత్వం ఆలోచిస్తోంది. వ్యాకిన్ తీసుకున్నట్లు సర్టిఫికేట్, లేదా కోవిడ్ పరీక్షలో నెగేటివ్ వచ్చినట్లు రిపోర్ట్ తీసుకు వస్తే వారిని స్టేడియం లోకి పంపాలని భావిస్తోంది.

టోక్యో వేదికగా జూలై 23  నుంచి విశ్వ క్రీడా సంబరాలు జరగనున్నాయి. గత ఏడాది జరగాల్సిన ఈ క్రీడలు కోవిడ్ కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం కోవిడ్ రెండో దశ ప్రపంచాన్ని వణికిస్తున్న తరుణంలో ఒలింపిక్స్ నిర్వహణను జపాన్ లో మెజార్టీ ప్రజలు వ్యతిరేకిస్తున్నా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఈ క్రీడలు నిర్వహించాడానికే అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం, జపాన్ ఆర్గనైజింగ్ కమిటీలు నిర్ణయించాయి. ఆ మెగా ఈవెంట్ ను వీక్షించేందుకు విదేశీ ప్రేక్షకులను అనుమతించడంలేదు. 

స్వదేశీ ప్రేక్షకులను అనుమతించే విషయమై జూన్ నెలలో తుది నిర్ణయం తీసుకుంటారు.  స్టేడియాలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా వారు మాస్కులు, పేస్  షీల్డులు ధరించాల్సి ఉంటుంది. అయితే వారు కేకలు, ఈలలు వేస్తూ హడావుడి చేయడానికి మాత్రం వీల్లేదు. కోవిడ్ పరీక్ష నెగెటివ్ రిపోర్ట్ వారం రోజుల లోపు  చేయించుకుంటేనే అనుమతిస్తారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్