Two Dates: ఆర్ఆర్ఆర్… సినీ అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సంచలన చిత్రం. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళిల కాంబినేషన్లో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. ఆఖరికి సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయడానికి అంతా సిద్ధం చేశాకా లాస్ట్ మినిట్ లో కరోనా థర్డ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సివచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడింది. అందుచేత ఓ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి… ఆ డేట్ కి రావడం కుదరకపోతే మరో డేట్ అనౌన్స్ చేయడం ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ… ఇప్పుడు రాజమౌళి రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడని చెప్పచ్చు. ఇంతకీ.. ఆ రెండు రిలీజ్ డేట్స్ ఎప్పుడంటే… కరోనా పరిస్థితులన్నీ సద్దుమణిగి, దేశవ్యాప్తంగా థియేటర్లు పూర్తి స్థాయిలో తెరుచుకుంటే మార్చి 18కి సినిమాను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు రాజమౌళి ప్రకటించారు.
ఒకవేళ ఆ తేదీకి దేశవ్యాప్తంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. ఏప్రిల్ 28కి ఆర్ఆర్ఆర్ థియేటర్లలోకి వస్తుందని కూడా అనౌన్స్ చేశాడు. ఇలా ఒకేసారి రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఇలా.. రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేయడానికి కారణం ఏంటంటే… సంక్రాంతి సందర్భంగా జనవరి 7న ఆర్ఆర్ఆర్ విడుదల చేయాలనుకున్నప్పుడు సంక్రాంతి సినిమాలు వాయిదా వేసుకోవాల్సివచ్చింది. అప్పుడు రాజమౌళి పై విమర్శలు వచ్చాయి. ఈసారి అలాంటి విమర్శలు రాకుండా ఉండేందుకే ఇలా రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశాడట జక్కన్న. ఇంతకీ… ఈ రెండింటిలో ఏ డేట్ లో ఆర్ఆర్ఆర్ వస్తుందో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.