Saturday, November 23, 2024
HomeTrending Newsఅంతర్జాతీయ బ్రూణ హత్యల నివారణ దినోత్సవం

అంతర్జాతీయ బ్రూణ హత్యల నివారణ దినోత్సవం

International Feticide Prevention Day :

ప్రపంచవ్యాప్తంగా పుట్టబోయే బిడ్డ అడ అని తెలియగానే వెంటనే బ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పురిటిలోని బిడ్డను పురిటిలోనే అంతమొంది స్తున్నారు. ఈ మధ్య కాలంలో ఆడపిల్లలపై వివక్ష పెరిగి పోయింది. ఈ విధానం మారాలి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధలు విధించినా కూడా ఈ పరీక్షలు చాటుమాటుగా యధేచ్చగా సాగిపోతుండడం శోచనీయం. ప్రతి ఆసుపత్రిలో విధిగా లింగనిర్ధారణ పరీక్షలు చేయమని కోరడం నేరం అని బోర్డులు తగిలించినా, చాటుమాటుగా ఈ తతంగం సాగిపోతూనే వుంది. ప్రభుత్వం అధికారులు లింగనిర్ధారణ పరీక్షల విషయంలో ఉక్కు పాదం మోపాలి.

లేకుంటే రానున్న కాలంలో ఇప్పటికే తగ్గిపోయిన ఆడ సంతతి నిష్పత్తి గణనీయంగా తగ్గిపోయే ప్రమాదముంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఉపధ్రవాన్ని ఆపడం ఎవరి తరము కాదు. ఆడ మగ నిష్పత్తి సమతుల్యంగా ఉండేవిధంగా నిబంధనలు కఠినతరం చేయాలి. ఎవరైనా డబ్బులకు కక్కుర్తి పడి లింగనిర్ధారణ పరీక్షలకు పాల్పడితే వారి హాస్పిటల్ లైసెన్స్ రద్దు చేయడమే కాకుండా పెద్దఎత్తున జరిమానాలు విధించాలని మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్