Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు దబాంగ్ ఢిల్లీ – గుజరాత్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 41-22తో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. తొలి అర్ధ భాగంలో 22-11తో భారీ ఆధిక్యం సంపాదించిన ఢిల్లీ రెండో అర్ధభాగంలోనూ అదే దూకుడు ప్రదర్శించి 19-11తో పైచేయి సాధించింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 19 పాయింట్ల తేడాతో విజయం సొంతం చేసుకుంది. ఢిల్లీ ఆటగాళ్ళు విజయ్-8; సందీప్ నర్వాల్-6; ఆషు మాలిక్ -6; మంజీత్-5; కృషన్-5తో సమిష్టి గా రాణించారు.
బెంగాల్ వారియర్స్- తెలుగు టైటాన్స్ మధ్య నేడు జరగాల్సిన రెండో మ్యాచ్ వాయిదా పడింది.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… దబాంగ్ ఢిల్లీ (48 పాయింట్లు); బెంగుళూరు బుల్స్ (46); పాట్నా పైరేట్స్ (45); హర్యానా స్టీలర్స్ (42); యూ ముంబా (41); బెంగాల్ వారియర్స్ (41); జట్లు టాప్ సిక్స్ లో ఉన్నాయి.