Tensions On Russia Ukraine Border :
రష్యా – ఉక్రెయిన్ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త రాజకుంటోంది. ఉక్రెయిన్ కు రెండు వందల కిలోమీటర్ల దూరంలో సుమారు లక్షన్నర సైనిక బలగాల్ని రష్యా మోహరించింది. ప్రతిగా అమెరికా ఫైటర్ జెట్ల తో ఉక్రెయిన్ కు మద్దతుగా రంగంలోకి దిగింది. తాజాగా ఈ వ్యవహారంలో బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తీవ్ర వ్యాఖ్యాలు చేశారు. ఉక్రెయిన్ పై దాడులతో రష్యా యుద్దానికి దారి తీసే పరిస్థితులు కల్పిస్తోందని, ఇలాంటి చర్యలు రష్యా ప్రతిష్టకు మచ్చ తెస్తాయన్నారు. ఆచరణ సాధ్యం కాని అంచనాలతో రష్యా దేశం ఉక్రెయిన్ పై కయ్యానికి కాలు దువ్వుతోందని, ప్రపంచ దేశాలు రష్యా దురాక్రమణ గమనిస్తున్నాయని బోర్రిస్ జాన్సన్ అన్నారు.
ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నివారణకు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ నిన్న రష్యా అధ్యక్షుడు వ్లద్మిర్ పుతిన్ తో ఫోనులో మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలు తాజా పరిస్థుతులపై చర్చించారు. శాంతి సహకరించాలని జాన్సన్ కోరారు. బలగాల మోహరింపు ఏమి లేదని సైనిక కవాతులో భాగంగానే ఉన్నాయని, తాము సంయమనంతో వ్యవహరిస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరేందుకు అన్ని హక్కులు కలిగి ఉన్నదని ఇంగ్లాండ్ ప్రకటించింది. నాటో కూటమిలో చేరటం ద్వారా ఉక్రెయిన్ రక్షణ బడ్జెట్ తగ్గి ప్రజా సంక్షేమం కోసం ఖర్చు చేసేందుకు అవకాశం ఉంటుందని బోరిస్ జాన్సన్ అన్నారు. రెండు రోజుల క్రితం ఉక్రెయిన్ రాజధాని క్యివ్ లో బోరిస్ జాన్సన్ పర్యటించారు.
Also Read : పాకిస్తాన్లో హిందూ వ్యాపారి దారుణ హత్య