Parliamentary Privilege Committee Notice :
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఫిర్యాదుపై స్పందించిన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ. అరవింద్ పై జరిగిన దాడి ఘటనపై విచారణ జరిపి 15 రోజుల్లో వాస్తవ నివేదిక ఇవ్వాలని హోంశాఖకు ఆదేశం. ఎంపీ అరవింద్ అభ్యంతరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్న ప్రివిలేజ్ కమిటీ. పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలతో రంగంలోకి దిగిన కేంద్ర హోంశాఖ, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, నిజామాబాద్ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఆర్మూర్ పోలీసులకు నోటీసులు జారీ.
15 రోజుల్లో సమగ్ర విచారణ జరిపి వాస్తవ నివేదిక అందజేయాలని పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఆదేశం. గత నెల 25న నిజామాబాద్ జిల్లా నందిపేటలో ధర్మపురి అరవింద్ పై పోలీసుల సమక్షంలో టీఆర్ఎస్ నేతలు దాడి చేశారని ఆరోపణలు. దాడి ఘటనపై గత నెల 30న పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన ధర్మపురి అరవింద్.
Also Read : ఎంపి అరవింద్ కు పసుపుబోర్డు సెగ