Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో బెంగాల్ పై పాట్నా, బెంగుళూరుపై గుజరాత్ విజయం సాధించాయి
పాట్నా పైరేట్స్- బెంగాల్ వారియర్స్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో 38-29తో పాట్నా గెలుపొందింది. తొలి అర్ధ భాగంలో 21-11తో భారీ ఆధిక్యం సంపాదించింది. రెండో భాగంలో బెంగాల్ పుంజుకుని 18-17 తో పైచేయి సాధించినా తొలి భాగంలో పాట్నా జోరుకు బెంగాల్ తల వంచక తప్పలేదు. పాట్నా రైడర్ సచిన్ 11 పాయింట్లు సాధించాడు.
గుజరాత్ జెయింట్స్ – బెంగుళూరు బుల్స్ జట్ల మధ్య హోరాహోరీగా జరిగిన రెండో మ్యాచ్ లో 40-36 తో గుజరాత్ విజయం సాధించింది. మొదటి భాగంలో గుజరాత్ 15-14తో స్వల్ప ఆధిక్యం సంపాదించింది. రెండో భాగంలో ఇరు జట్లూ నువ్వా-నేనా అన్నట్లు తలపడ్డాయి. చివరకు 25-22తో గుజరాత్ దే పైచేయి అయ్యింది. నాలుగు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ రైడర్ ప్రదీప్ కుమార్ 14, బెంగుళూరు కెప్టెన్ పవన్ షెరావత్ 12 పాయింట్లు సాధించారు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (60 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (57); బెంగుళూరు బుల్స్ (55); హర్యానా స్టీలర్స్ (53); యూముంబా(48); యూపీ యోధ(47) టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: ముంబై, యూపీ, హర్యానా విజయం