Friday, March 20, 2026
HomeTrending Newsఇంటికే సమ్మక్క సారలమ్మ ప్రసాదం

ఇంటికే సమ్మక్క సారలమ్మ ప్రసాదం

Madaram Prasadam  : మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల ప్రసాదం ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ తో పాటు పోస్ట్ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి అన్నారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో డోర్ డెలివరీ చేసేలా దేవాదాయ శాఖ ఏర్పాట్లు చేస్తుందని ఆయన తెలిపారు. అమ్మవారి ప్రసాదంను డోర్ డెలివరీ చేసేందుకు ఇండియన్ పోస్టల్, ఆర్టీసీ, ఐటీ శాఖల సేవలను వినియోగించుకోనున్నట్లు ఆయన తెలిపారు. అమ్మవారి ప్రసాదం నేరుగా పొందలేని వారికి… ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ లేదా పోస్ట్ ద్వారా తమ ఇంటికే చేరవేసేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.

భక్తుల ఆర్డర్ మేరకు ఇంటి నుంచే బెల్లం- బంగారం ప్రసాదం అమ్మవారికి సమర్పించే వారి కోసం కూడా ఆర్టీసీ సంస్థ భక్తుల ఇంటికి వచ్చి ప్రసాదాన్ని తీసుకుని వెళ్లనుందని, దానిని అమ్మవారికి సమర్పించి… భక్తులకు అందేజేయనున్నట్లు వెల్లడించారు. ఆన్ లైన్ లో మీ సేవ లేదా టీయాప్ ఫోలియో TAPP-FOLIO (మొబైల్ ప్లే స్టోర్ డౌన్ లోడ్ చేసుకుని )లో బుక్​ చేసుకోవాలన్నారు. అనంతరం వారికీ పోస్టల్ సేవల ద్వారా ప్రసాదాన్ని డోర్ డెలివరీ చేస్తారని తెలిపారు.ఆర్టీసీ పార్సిల్ సేవల ద్వారా ప్రసాదాన్ని పొందాలనుకునే వారు ఆ సంస్థను సంప్రదించాలని అన్నారు. ఈ సేవలకు గాను ఒక ప్రసాదం ప్యాకెట్ కు భక్తులు రూ. 225 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. (ఆర్టీసీ ద్వారా సేవలను పొందేవారికి ఈ ఛార్జీలు వర్తించవు. దూరాన్ని బట్టి చార్జీలను ఆర్టీసీ సంస్థ నిర్ణయిస్తుంది) 200 గ్రాముల బెల్లం ప్రసాదం, పసుపు కుంకుమ, అమ్మవారి ఫోటో ను భక్తులకు ఇంటి వద్ద అందజేస్తామన్నారు. ఫిబ్రవరి 12- 22 వరకు ఆన్ లైన్ లో ఇంటికే ప్రసాదం సేవలను వినియోగించుకోవాలని మంత్రి కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular