Pro Kabaddi: వివో ప్రో కబడ్డీ లీగ్ లో నేడు జరిగిన మ్యాచ్ ల్లో తమిళ్ తలైవాస్ పై బెంగాల్ వారియర్స్; తెలుగు టైటాన్స్ పై జైపూర్ పింక్ పాంథర్స్ ఘనవిజయం సాధించాయి.
బెంగాల్ వారియర్స్- తమిల్ తలైవాస్ జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో 52-21తో బెంగాల్ ఘన విజయం సాధించింది. ఆట మొదటినుంచీ బెంగాల్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి భాగంలో 28-10తో భారీ ఆధిక్యం సంపాదించి, అదే జోరును రెండో భాగంలోనూ కొనసాగించి 24-11 తో తిరుగులేని పైచేయి చూపింది. మ్యాచ్ ముగిసే నాటికి 31పాయింట్ల తేడాతో సూపర్ విక్టరీ సొంతం చేసుకుంది. బెంగాల్ కెప్టెన్ మణీందర్ సింగ్-14; మొహమ్మద్-13 పాయింట్లతో బెంగాల్ భారీ విజయానికి దోహదం చేశారు.
జైపూర్ పింక్ పాంథర్స్ – తెలుగు టైటాన్స్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 54-35 తో జైపూర్ దుమ్ము రేపింది. ఆట ప్రథమార్ధంలో 23-11 తో ఆధిక్యం ప్రదర్శించిన జైపూర్ ద్వితీయార్ధంలో కూడా 31-24తో పైచేయి సంపాదించింది. మొదటి భాగంలో పేలవమైన ఆట ఆడిన రెండో భాగంలో తెలుగు కాస్త మెరుగైన ఆటతీరు కనబరిచింది. దీనితో మ్యాచ్ ముగిసే నాటికి 19 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. జైపూర్ రైడర్ అర్జున్ దేశ్వాల్ 14 పాయింట్లతో రాణించాడు.
నేటి మ్యాచ్ లు పూర్తయిన తరువాత… పాట్నా పైరేట్స్ (80 పాయింట్లు); దబాంగ్ ఢిల్లీ (65); యూపీ యోధ (63); హర్యానా స్టీలర్స్(63); జైపూర్ పింక్ పాంథర్స్ (62); బెంగుళూరు బుల్స్ (61); టాప్ సిక్స్ లో ఉన్నాయి.
Also Read : ప్రొ కబడ్డీ: జైపూర్, పాట్నా, పూణే విజయం