America Senate Resolution :
రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు వివాదంలో అమెరికా సెనేట్ దేశాధ్యక్షుడు జో బిడెన్ కు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచింది. యూరోప్ లో శాంతి స్థాపనకు నాటో తో కలిసి పనిచేసేందుకు అనుమతించింది. ఈ మేరకు జో బిడెన్ విధానాలను సమర్థిస్తూ గురువారం రాత్రి సెనేట్ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించింది. రష్యా ఏ క్షణంలో అయినా ఉక్రెయిన్ మీద దాడికి దిగవచ్చనే పుకార్ల నేపథ్యంలో అమెరికా సెనేట్ తీర్మానం ప్రాధాన్యం సంతరించుకుంది. రష్యా దురాక్రమణ చేస్తే నిలువరించేందుకు, ఉక్రెయిన్ కు మద్దతుగా ఆ దేశ సార్వభౌమాదికారాన్ని, సమగ్రతను కాపాడేందుకు అండగా ఉండాల్సిన ఆవశ్యకతను సెనేట్ ప్రతినిధులు ప్రస్తావించారు.
మరోవైపు అమెరికా సెనేట్ తీర్మానంపై రష్యా రుసరుసలాడుతోంది. యూరోప్ లో ఆధిపత్యం కోసమే అమెరికా దుందుడుకు విధానాలకు పాల్పడుతోందని రష్యా విదేశాంగ ప్రతినిధి కొనషేన్కోవ్ విమర్శించారు. పశ్చిమ దేశాలు యుద్ధం ప్రారంభించే ముందు ఇతరుల మీద నెపం వేయటం మొదటి నుంచి జరుగుతోందన్నారు. అమెరికా తనకు అనుకూలంగా అంతర్జాతీయ మీడియాలో కూడా రష్యా దాడులకు సిద్దమైందని తప్పుడు నిర్వహిస్తోందని మండిపడ్డారు. సరిహద్దుల్లో సైన్యం కొంతవరకు ఉపసంహరించుకున్తున్నామని రష్యా పునర్ద్ఘాటించింది. రష్యా సరిహద్దుల్లో నాటో బలగాలు, అమెరికా కలిసి తమ సైన్యాన్ని కవ్వించే చర్యలకు పాల్పడితే గుణపాటం తప్పదని రష్యా ఖరాఖండిగా ప్రకటించింది.
మరోవైపు ఉక్రెయిన్ తో సరిహద్దు వివాదంపై అమెరికాతో చర్చించేందుకు తాము సిద్దమని రష్యా ప్రకటించింది. రష్యా ఆహ్వానంపై స్పందించిన అమెరికా.. రష్యా దాడులకు దిగకపోతే సంప్రదింపులకు స్పష్టంచేసింది. రెండు దేశాల విదేశాంగమంత్రుల సమావేశం వచ్చే వారం జరిగే అవకాశం ఉంది.