Role Model: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్న రీతిలోనే క్రీడల్లో కూడా ఆదర్శంగా నిలిచేలా క్రీడాకారులు రాణించాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఆకాంక్షించారు. అబుదాబిలో జరగనున్న ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్స్ షిప్ – 2022కు ఎంపికైన క్రీడాకారులను అభినందించారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (SATS) కు ఆధ్వర్యంలో నడుస్తోన్న హకీంపేట్ క్రీడా పాఠశాల విద్యార్ధులు అబుదాబిలో ఫిబ్రవరి 27 నుండి మార్చి 6 వరకు జరుగబోయే ఏషియన్ సెయిలింగ్ ఛాంపియన్స్ షిప్ లో లేసర్ 4.7 విభాగంలో దేశం తరఫున ఆడేందుకు ఎంపికయ్యారు. వీరిలో ఇద్దరు బాలికలు, ఒక బాలుడు ఉన్నారు. వీరు ఎంపిక కావడంతో పాటు జాతీయ జట్టుకు సారధ్యం వహించే అరుదైన గౌరవాన్ని కూడా సాధించడం విశేషం. హైదరాబాద్ లోని తన క్యాంప్ కార్యాలయంలో క్రీడాకారులను మంత్రి శ్రీనివాస గౌడ్ అభినందించారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ మాట్లాడుతూ…రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి , ఆటగాళ్లను ప్రోత్స హించేందుకు సిఎం కేసిఆర్ ఆదేశాలతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనిలో భాగంగా రాష్ట్రంలో అత్యుత్తమ క్రీడా పాలసీ ని రూపొందిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో క్రీడా మైదానాలను నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఒలింపిక్స్ లో వివిధ క్రీడాంశాలలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు పాల్గొనేలా కార్యాచరణ ను రూపొందించాలని క్రీడా శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
అనంతరం, SATS అర్చరీ కోచ్ డా. రవిశంకర్ పల్లెల…. అర్చరీ శిక్షణ లో చేసిన కృషిని గుర్తించి OMG సంస్థ తన Book of Records పేరును నమోదు చేసుకున్న సందర్భంగా మంత్రి ఆయన్ను అభినందించారు.
Also read : క్రీడాకారులకు మంత్రి అభినందన