Saturday, November 23, 2024
HomeTrending Newsభారతీయుల తరలింపు ప్రారంభం

భారతీయుల తరలింపు ప్రారంభం

ఉక్రెయిన్ నుంచి భార‌తీయుల త‌ర‌లింపు ప్ర‌క్రియ ప్రారంభమ‌యింది. ప్ర‌త్యేక విమానంలో నేడు భార‌త్ కు రానున్నారు. 219 మందితో కూడిన ఎయిర్ ఇండియా విమానం రోమానియా నుంచి బయలు దేరిందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ట్విట్టర్ వేదికగ వెల్లడించారు. తొలి విమానం ఈ రోజు అర్థ‌రాత్రి 1: 50కి ముంబై చేరుకోనుంది. కాగా రేపు ఉద‌యం 7 : 40కి తొలి మరో విమానం ఢిల్లీ చేరుకోనుంది.

490మంది విద్యార్థులు రెండు విమానాల్లో భార‌త్ రానున్నారు. వీరిలో 22మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు ఎయిర్ ఇండియా విమానం ముంబై నుంచి బయలుదేరింది. రష్యా సైనిక దాడి ఫలితంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించేందుకు ఎయిర్ ఇండియా విమానం ఈ రోజు (శనివారం) ఉదయం ముంబై నుంచి రొమేనియా రాజధాని బుకారెస్ట్‌కు బయలుదేరింది.

 

రోమానియా, హంగరీ దేశాల సరిహద్దులకు వచ్చే భారతీయులు అధికారులతో సంప్రదించి.. వారితో సమన్వయం చేసుకొని రావాలని కీవ్ లోని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేశింది. రోమానియా , హంగరీ సరిహద్దుల్లో ఇప్పటికే భారత పౌరులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారని, యుక్రెయిన్ తూర్పు ప్రాంతంలోని కొందరు మాత్రం రావాల్సి ఉందని భారత దౌత్య కార్యలయ వర్గాలు వెల్లడించాయి. కీవ్ లో ఉన్న భారతీయ కుటుంబాలు, ముఖ్యంగా విద్యార్థులు త్వరితగతిన రాయబార కార్యాలయం సంప్రదించాలని, ఉక్రెయిన్ పశ్చిమ ప్రాంతంలోని నగరాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండాలని ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్