Friday, October 18, 2024
Homeస్పోర్ట్స్మహిళల హాకీ: ఇండియాపై స్పెయిన్ విజయం

మహిళల హాకీ: ఇండియాపై స్పెయిన్ విజయం

Spain won: 2021-22 మహిళల ఎఫ్.ఐ.హెచ్. ప్రో లీగ్ లో భాగంగా  ఇండియా –స్పెయిన్ జట్ల మధ్య జరిగిన రెండో మ్యాచ్ లో 4-3తో స్పెయిన్ విజయం సాధించింది. చివరి నిమిషంలో స్పెయిన్ క్రీడాకారిణి గిన్ జంటిల్ పెనాల్టీ కార్నర్ ద్వారా సాధించిన గోల్ తో స్పెయిన్ విజయ కేతనం ఎగురవేసింది. నిన్న ఇదే జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 2-1 తో గెలిచిన ఇండియా నేడు ఓటమి పాలైంది. ఓడిశా రాజధాని భువనేశ్వర్ లోని కళింగ స్టేడియంలో ఈ మ్యాచ్ లు జరుగుతున్నాయి.

నేటి మ్యాచ్ లో ఆట నాలుగో నిమిషంలోనే స్పెయిన్ ఫీల్డ్ గోల్ చేసి బోణీ కొట్టింది, 10వ నిమిషంలో ఇండియా క్రీడాకారిణి కుమారి సంగీత ఫీల్డ్ గోల్ చేసి స్కోరు సమం చేసింది. 15వ నిమిషంలో స్పెయిన్ రెండో గోల్ చేసి తొలి పావు భాగం పూర్తయ్యే నాటికి 2-1 ఆధిక్యం సంపాదించింది.

ఆట రెండవ పావు భాగంలో 22వ నిమిషంలో ఇండియా (సలీమా -ఫీల్డ్ గోల్); 24వ నిమిషంలో స్పెయిన్ (బేలెన్- ఫీల్డ్ గోల్) సాధించారు. తొలి అర్ధబాగంలో 3-2తో స్పెయిన్ ముందంజలో ఉంది. మూడో పావు భాగంలో రెండు జట్లూ గోల్ చేయలేకపోయాయి.  చివరి పావు భాగంలో 49వ నిమిషంలో ఇండియా (నమిత – ఫీల్డ్ గోల్) సాధించి స్కోరు సమం చేసింది. ఆట చివరి వరకూ అదే స్కోరు సాగడంతో మ్యాచ్ డ్రా అయితుందని అనుకున్నారు.  అయితే ఆట మరికొన్ని క్షణాల్లో ముగుస్తుందనగా పెనాల్టీ కార్నర్ గోల్ సాధించిన స్పెయిన్ విజయం సాధించి నిన్నటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్