Thursday, September 19, 2024
Homeసినిమా‘సెబాస్టియన్‌’ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

‘సెబాస్టియన్‌’ ట్రైలర్ రిలీజ్ చేసిన విజయ్ దేవరకొండ

Vijay Released: జ్యోవిత సినిమాస్‌ పతాకంపై కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నివేక్ష (నమ్రతా దరేకర్‌) నటీనటులుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 4న ప్రపంచ వ్యాప్తంగా  విడుదలవుతున్న సందర్భంగా చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లో సినీ అతిరదుల సమక్షంలో ఘనంగా జరుపుకుంది. సామాజిక మద్యమమైన ట్విట్టర్ ద్వారా సెన్సేనల్ హీరో విజయ్ దేవరకొండ చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు.

దర్శకుడు బాలాజీ మాట్లాడుతూ “మా సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు. ఇప్పుడు విడుదలైన ట్రైలర్ కంటే సినిమా చాలా బాగుంటుంది. ఈ సినిమా చూస్తున్న వారికి ఒక రకమైన కామిక్, సస్పెన్స్, థ్రిల్లింగ్ గాని కలిగిస్తుంది. నిన్న మేము ఫస్ట్ కాపీ చూశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులందరూ ఈ సినిమాలోని కైండ్ ఆఫ్ విజువల్స్ బీస్ట్ ను, కైండ్ ఆఫ్ సౌండింగ్ ను ఎక్స్పీరియన్స్ చేయడానికి వారి హియర్స్ ను, ఐస్ ను ప్రిపేర్ చేసుకోవాలి. సినిమా కథ రాసుకున్నప్పుడే చాలా ఎగ్జైట్మెంట్ అయ్యి రాసుకున్నాను. దీనికి తగ్గట్టు జిబ్రాన్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రేచీకటి పెర్ఫార్మన్స్ డీల్  చేయడం చాలా కష్టం కానీ.. ఈ సినిమాలో కిరణ్ అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మన్స్ చేశాడు. మదనపల్లె లో 32 రోజుల్లో ఈ సినిమా చేయడం జరిగింది. నటీనటులు, టెక్నిషియన్స్ అందరి ఫుల్ సపోర్ట్ చేశారు. ఇలాంటి మంచి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించిన కిరణ్ కు, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. మా సినిమా ట్రైలర్ ను విడుదల చేసిన విజయ్ దేవరకొండకు ధన్యవాదాలు. సిల్వర్ స్క్రీన్ పై వస్తున్న ఈ  సినిమాను ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని ఆతృతగా ఎదురుచూస్తున్నాను. ఇందులో ప్రతి సెటప్ కూడా చాలా కొత్తగా ట్రై చేశాం. సిద్దారెడ్డి, రాజు, ప్రమోదు గార్లు నాకు బాగా సపోర్ట్ గా నిలిచారు. జ్యోవిత బ్యానర్లో వస్తున్న ఈ సినిమా తరువాత ఈ బ్యానర్ మంచి మంచి సినిమాలు తీస్తూ ఎంతో మందికి అవకాశం కూడా కల్పిస్తుంది.  నివేక్ష ,కోమలి ప్రసాద్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు. టెక్నీషియన్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు. బాలాజీ గారు నాకు రేచీకటి ఉన్న కథను చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ అయ్యాను. ఈ కథ చాలా ఇంట్రెస్ట్ అనిపించి ఈ సినిమా చెయ్యడం జరిగింది. రేచీకటి ఉన్న మనిషి లైఫ్ ఎలా ఉంటుందని బాలాజీ గారు చాల బాగా చూపించారు. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి “సెబాస్టియన్‌ పిసి 524’ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో బయటికి వస్తారు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్