Sunday, June 14, 2026
Homeసినిమా'సెబాస్టియన్‌’ నుంచి 'సెబా' లిరికల్ విడుదల

‘సెబాస్టియన్‌’ నుంచి ‘సెబా’ లిరికల్ విడుదల

Seba Song: కిరణ్‌ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘సెబాస్టియన్‌ పిసి524’. కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి.జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. మార్చి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సినిమాలో ‘సెబా…‘ సాంగ్ విడుదల చేశారు.

కంటిలోన చీకటిని, గుండెలోన దాచుకుని…
వేదనలో వేడుకలా వెలుగు సెబా…
రాజాధి రాజా!
వదిలిపోని వేకువని, తిరుగులేని రేపటిని…
ఏలుకొనే ఏలికలా ఎదురు సెబా…
రాజాధి రాజా!
…ఇలా చక్కటి సాహిత్యంతో, సినిమాలో కథానాయకుడి పరిస్థితి గురించి వివరిస్తూ ‘సెబా…’ పాట సాగింది.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. “మా ‘సెబాస్టియన్‌ పిసి524’ కిరణ్ అబ్బవరం ఖ‌చ్చితంగా హ్యాట్రిక్‌ హిట్‌ అందుకుంటారు. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ‘హేలీ…’ పాటలు మంచి స్పందన లభించింది. ఇప్పుడీ ‘సెబా…’ పాట సైతం విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన అందుకుంది. జిబ్రాన్‌ సంగీతం దర్శకత్వంలో పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. మార్చి 4వ తేదీన ప్రైమ్‌ షో ఎంటర్టైన్మెంట్‌ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు” అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular