Saturday, March 29, 2025
HomeTrending Newsఅడ్డుపడుతున్నారు : ధర్మాన కృష్ణ దాస్

అడ్డుపడుతున్నారు : ధర్మాన కృష్ణ దాస్

overall development: రాష్టంలోని అన్ని జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలన్నదే సిఎం జగన్ లక్ష్యమని, అందుకే తమ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని సంకల్పించిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలనూ సమానంగా అభివృద్ధి చేయాలన్నదే తమ అభిమతమన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం ఎంత నష్టపోయామో అందరూ గ్రహించాలని, అందుకే అభివృద్ధి అంతటినీ ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం చేయకుండా అన్ని జిల్లలనూ అభివృద్ధి చేయాలని సిఎం జగన్ సంకల్పించారని ధర్మాన చెప్పారు.

వికేంద్రీకరణ చేస్తేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని, అందుకే మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోన్న సందర్భంలో కొన్ని దుష్ట శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయని  ధర్మాన ఆరోపించారు. చంద్రబాబు కేవలం తన సామాజిక వర్గానికి మేలు చేసేందుకే అమరావతి పేరుతో స్వార్ధ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్