Tuesday, April 16, 2024
Homeస్పోర్ట్స్శ్రీలంకతో టెస్ట్: ఇండియా భారీ గెలుపు

శ్రీలంకతో టెస్ట్: ఇండియా భారీ గెలుపు

With Huge Margin: మొహాలీ టెస్టులో ఇండియా ఘనవిజయం సాధించింది. బ్యాటింగ్ లో రాణించిన రవీంద్ర జడేజా బౌలింగ్ లోనూ తన సత్తా చాటి రెండు ఇన్నింగ్స్ లో కలిపి 9 వికెట్లు తీసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులకే ఆలౌట్ అయి ఫాలో ఆన్ ఆడిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్ లో178 పరుగులకే కుప్పకూలింది. దీనితో ఇండియా ఇన్నింగ్స్, 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు రోజులకే మొదటి టెస్ట్ ముగిసింది.

శ్రీలంక 4  వికెట్లకు 108 పరుగులతో నేడు మూడో రోజు ఆట మొదలు పెట్టింది. నిన్న 26 పరుగులతో క్రీజూలో ఉన్న నిశాక 61 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. చరిత్ అసలంక 29 పరుగులు చేసి ఔటయ్యాడు. మిగిలిన వారిలో నలుగురు…. లక్మల్, ఎంబుల్దేనియా, విశ్వ ఫెర్నాండో, లాహిరు కుమార్ డకౌట్ అయ్యారు. దిక్వెల్వా కేవలం రెండు పరుగులే చేసి ఔటయ్యాడు. దీనితో 174 పరుగులకే లంక చాప చుట్టేసి, ఫాలో ఆన్ కు దిగింది. మొదటి ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా ఐదు; బుమ్రా, అశ్విన్ చెరో రెండు; షమీ ఒక వికెట్ పడగొట్టారు. మొత్తం వికెట్లలో సగం ఎల్బీ ఔట్లే కావడం గమనార్హం.

రెండో ఇన్నింగ్స్ లో కూడా లంక త్వరత్వరగా వికెట్లు కోల్పోయింది. 9 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. దిక్వెల్వా 51 పరుగులతో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. ధనుంజయ డిసిల్వా-30; ఆంగ్లో మాథ్యూస్-28;  కరుణరత్నే-27 పరుగులు చేశారు.  ఇండియా బౌలర్లలో జడేజా, అశ్విన్ చెరో నాలుగు, షమీ రెండు వికెట్లు సాధించారు.

ఆల్ రౌండ్ ప్రతిభ చూపిన రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ అఫ్ ద మ్యాచ్’ దక్కింది.

సిరీస్ లో భాగంగా రెండవ, ఆఖరి టెస్ట్ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మార్చి 12 నుంచి మొదలు కానుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్