అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్…మధులతకు ఎన్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మహిళ ఇన్‌స్పెక్టర్ అధికారిగా ఈ రోజు మధులత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. మధులత ఉద్వేగానికి గురయ్యారు.
మధులత 2002 బ్యాచ్ కు చెందిన మహిళా సర్కిల్ ఇన్ స్పెక్టర్. సౌత్ జోన్ పాతబస్తీ ఉమెన్ పోలీస్ స్టేషన్. సీఐగా, ఎస్ బి వింగ్ సీఐగా సమర్ధంగా విధులు నిర్వహించారు మధులత. మహిళా సీఐ పేరు సీల్డ్ కవర్ లో సర్ప్రైజ్ గా ఉంచారు సిటీ పోలీస్ బాస్ సీవీ ఆనంద్. హోంమంత్రి మహమూద్ అలీ , సీపీ ఆనంద్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనే ఆమె పేరు అధికారికంగా ప్రకటించారు.
Also Read : ఇంతేనా మహిళా దినోత్సవమంటే?