Saturday, November 23, 2024
HomeTrending Newsదళితబంధు దేశంలోనే గొప్ప పథకం - మంత్రి కొప్పుల

దళితబంధు దేశంలోనే గొప్ప పథకం – మంత్రి కొప్పుల

దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని, నిన్న కూలీలు, డ్రైవర్లుగా పనిచేసిన వారు నేడు వాహనాలకు యజమానులుగా మారడం గొప్ప విషయమని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియం వద్ద హుజురాబాద్ నియోజకవర్గ దళితబంధు లబ్ధిదారులకు 202 యూనిట్లను మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ వెంకటేష్ నేత, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ తదితరులతో కలసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే సీఎం కేసీఆర్‌ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకంతో దళితులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్‌ చేసిన సంకల్పం నేడు సాకారమవుతుందని తెలిపారు. దళిత బంధు పథకం నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు.


రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ 2001లో ఆవిర్భవించినప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్నదని అన్నారు. 2002లో టీఆర్ఎస్ పార్టీ దళిత పాలసీని ప్రకటించిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళిత జాతి అభివృద్ధికి నాంది పలికిందని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా సంక్షేమ పథకాలు ఆగవని స్పష్టం చేశారు.
బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు. మంత్రులుగా తాము లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేసే అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సూడా చైర్మన్ జీవి రామకృష్ణా రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్, ఈ.డి. సురేష్, ఉప రవాణా శాఖ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, ఎంవీఐ మహ్మద్‌ సిరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Also Read : సామాజిక వివక్ష నిర్మూలనకు దళిత బంధు

RELATED ARTICLES

Most Popular

న్యూస్