Sunday, June 7, 2026
Homeసినిమా12న 'అఖండ' కృత‌జ్ఞ‌త స‌భ‌

12న ‘అఖండ’ కృత‌జ్ఞ‌త స‌భ‌

Thanks meeting: నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన లేటెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘అఖండ‌’. సింహా, లెజెండ్ చిత్రాల వీరిద్దరి కాంబినేషన్లో  వచ్చిన అఖండ‌ హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్స్ సాధించ‌డం విశేషం.ఈ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్ సీస్ లో సైతం రికార్డు క‌లెక్ష‌న్స్ సాధించింది. బాల‌య్య కెరీర్ లోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా స‌రికొత్త రికార్డ్ సాధించింది. ఆంద్రప్రదేశ్‌లో కరోనా థర్డ్ వేవ్ మరియు తక్కువ టికెట్ ధర వంటి అనేక ప్ర‌తికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, అఖండ బాక్సాఫీస్ వద్ద భారీ మరియు నిజమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

ద్వారకా క్రియేషన్స్ పతాకం పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం బయ్యర్లందరికీ భారీ లాభాలను అందించింది. ఈ సంద‌ర్భంగా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అఖండ 100 రోజుల వేడుక, అఖండ కృతజ్ఞత సభ మార్చి 12న కర్నూలులో జరగనుంది. ఈ వేడుకకు చిత్ర బృందం మొత్తం హాజరు కానుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుంద‌ని బోయ‌పాటి ఇటీవ‌ల ప్ర‌క‌టించారు. అయితే దీనిపై మ‌రింత‌గా క్లారిటీ రావాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular