Saturday, November 23, 2024
HomeTrending Newsచైనా కబంధ హస్తాల్లోకి పాక్ ?

చైనా కబంధ హస్తాల్లోకి పాక్ ?

ఆర్థికంగా ఇప్పటికే ఒడిదుడుకుల్లో ఉన్న పాకిస్తాన్… ఇప్పుడు మరో తప్పడుగు వేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.  చైనాతో స్వేచ్చా వాణిజ్యం (Free Trade Agreement) కోసం చర్చలు జరుపుతోంది. ఈ ఒప్పందం కనుక అమలులోకి వస్తే పాకిస్తాన్ నిలువెల్లా అప్పుల్లో కూరుకుపోతుంది. చైనా చేతిలో పాక్ కీలుబొమ్మగా మారటం ఖాయం. పాకిస్తాన్ కు ఎక్కువగా అప్పులు ఇచ్చిన దేశాల్లో ప్రస్తుతం చైనా ప్రథమ స్థానంలో ఉంది. చైనా ఇప్పటివరకు రెండు బిలియన్ల అమెరికన్ డాలర్ల అప్పును పాకిస్తాన్ కు ఇచ్చింది. ఇందుకు ప్రతిగా గిల్గిత్ బాల్టిస్తాన్ , పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం చైనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా యురేనియం తవ్వకాలకు చైనాతో ఒప్పందం చేసుకుంది. బియ్యం ఎగుమతులపై పరిమితి ఎత్తివేయాలని పాక్ కోరుతోంది.

పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇటీవలి చైనా పర్యటనలో ప్రధానంగా స్వేఛ్చ వాణిజ్యం పైనే చర్చించినట్టు పాకిస్తాన్ మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. ఫ్రీ ట్రేడ్ అమలులోకి వస్తే రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బలోపేతం అవుతాయని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది.

చైనాతో సిపెక్ (china pakistan economic corridor) ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా బెలోచిస్తాన్ రాష్ట్రంలో గ్వదర్ ఓడరేవు లీజుకు ఇచ్చింది. ఈ రేవు నుంచి చైనాకు రహదారి నిర్మించి గల్ఫ్ దేశాలతో పాటు పాకిస్తాన్ నుంచి వివిధ రకాల ముడి సరుకు దిగుమతి చేసుకుంటోంది. బెలోచిస్తాన్ రాష్ట్రంలో ఇప్పటికే రికో డిక్ బొగ్గు గనులు, రాగి, జింక్ గనులు చైనా కంపెనీల చేతుల్లోకి వెళ్ళాయి. సహజవాయువు నిల్వల్ని చైనా తరలించుకుపోతోంది. చైనా కంపెనీల అరాచకాలతో బెలోచిస్తాన్, ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రాల్లో తిరుగుబాటు మొదలైంది.

ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ద్వారా దేశం చైనా కబంద హస్తాల్లోకి వెళ్తుందని వివిధ స్వచ్చంద సంస్థలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయటం లేదు. పాకిస్తాన్ లోని అన్ని రాజకీయ పార్టీల నేతలు ఇప్పుడు చైనా కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో చైనా నిర్ణయించిన నేతలే దేశంలో ప్రధానమంత్రిగా పని చేసే దుస్థితి రానుంది.

ఇవి కూడా చదవండి: 60కి చేరిన పెషావర్‌ మృతుల సంఖ్య

RELATED ARTICLES

Most Popular

న్యూస్