పంజాబ్ లో యువత డ్రగ్స్ వాడి నాశనం అయింది.. తెలంగాణ మరో పంజాబ్ కానివ్వనని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ వాడే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ కేసుల్లో విచారణ వేగవంతం చేయాలని ఈ రోజు హైదరాబాద్ ఎన్ఫోర్సుమేంట్ డైరెక్టరేట్ లో రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను… డ్రగ్స్ వాడకుండా చూడండి..అని కోరారు. సినీ ఇండస్ట్రీ లో కొంతమంది చేసే తప్పుల వల్ల మొత్తం ఇండస్ట్రీ కి బ్యాడ్ నేమ్ వస్తుంది… ఇండస్ట్రీ ని డ్రగ్స్ నుండి కాపాడండి..అని విజ్ఞప్తి చేశారు.
12 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నది..రాసి పెట్టుకోండని, అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ దొంగల అంతు చూస్తా.. చార్మినార్ దగ్గర గుడ్డలు ఉడదీసి కొడుతామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. 2023 మార్చిలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. డ్రగ్స్ వాడే వాళ్ళు డ్రగ్స్ వ్యాపారం చేసే వాళ్ళు ఏ బొక్కలో దాక్కున్న గుంజుకు వస్తామని వార్నింగ్ ఇచ్చారు.
డ్రగ్స్ మహమ్మారి విద్యా సంస్థల్లో విజ్రంబిస్తుందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ గురించి మాట్లాడితే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పోతుందని కేటీఆర్, బాల్క సుమన్ లాంటి వాళ్ళు పెద్ద పెద్ద ప్రగల్బాలు పలికారు…సింగరేణి కాలనీలో జరిగిన బాలిక అత్యాచారం గంజాయి మత్తులో చేసింది కాదా ? అని ప్రశ్నించారు. దూల్పేట్ గుడుంబా స్థావరల పై దాడులు చేసారు కానీ వారికీ ప్రత్యామ్నాయం కల్పించలేదు…అందుకే వాళ్ళు గంజాయి అమ్ముతున్నారు, వాడుతున్నారని తెలిపారు. తెలంగాణలో స్కూల్స్ నుండి కాలేజెస్ వరకు డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు.
జూబ్లీహిల్స్ పరిధిలో కాంగ్రెస్ హయాంలో 4 పబ్స్ ఉండే, ఇయ్యాల 90 పబ్స్ ఉన్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ లో నైట్ బయటికి వెళ్ళాలి అంటే నా లాంటి వాడికి కూడా భయం అవుతుందని, 2017 విచారణ ఏం అయింది… ఎందుకు అటక ఎక్కిందని ప్రశ్నించారు. ఆకున్ సభర్వాల్ ను అర్ధాంతరంగా బదిలీ ఎందుకు చేసారు…అప్పుడు 12 ఏఫైఆర్ లు చేసారు…ఇప్పుడు అవి ఏమయ్యాయన్నారు. దింట్లో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని, అన్ని విచారణ సంస్థలకు ఫిర్యాదు చేశా అయినా కూడా ముందుకు రాలేదని ఆరోపించారు.
తెలంగాణ యువతను, ప్రజలను డ్రగ్స్ నుండి కాపాడుకోవాలన్న రేవంత్ రెడ్డి ఈడీ అధికారులు విచారణ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు…స్పష్టంగా ఈడీ చెప్పింది, ప్రభుత్వం సహకరించట్లేదని…అన్నారు. ఆబ్కారీ శాఖ అధికారుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ ఈడీ వాళ్లకు వారు ఇవ్వట్లేదని ఆరోపించారు. గుజరాత్, ముంబై పోర్టులలో 100 క్వింటాల్ డ్రగ్స్ పట్టుబడ్డాయి…వ్యవస్థికృత నేరానికి పాల్పడుతున్నారు..కేంద్ర ప్రభుత్వ పరిధిలో స్వంతంత్రంగా విచారణ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సిఎం కెసిఆర్ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతా అన్నారు… కానీ ఏం జరగలేదు మాటలే మారినాయి…దొరగారు లేచినపుడే ఊరు తెల్లారినట్లు ఉంది కేసీఆర్ కథ…అని ఎద్దేవా చేశారు.
సగం హైదరాబాద్ మత్తులో ఊగుతుంది..1000 మందితో ఒక విభాగం ఏర్పాటు చేశామని చెప్తున్నారు మరీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఈడీ కి ఎందుకు సహకరించట్లేదని మండిపడ్డారు. కేటీఆర్ కు వైట్ చాలాంజ్ విసిరాము… వైట్ చాలాంజ్ అంటే డ్రగ్స్ తీసుకోలేదని బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం..విశ్వేశ్వర్ రెడ్డి కి, కేటీఆర్ కు సవాలు విసిరాను… వెంటనే కేటీఆర్ కోర్ట్ వెళ్లి స్టే తెచ్చుకున్నాడు…అందుకే నేనేమి మాట్లాడాను… మీరు సేకరించిన డేటా, ఆధారాలు, ఈడీ కి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా…అన్నారు. మీ భయానికి గల కారణాలు ఏంటి, మీరు ఎవరిని కాపాడాలని చూస్తున్నారని సిఎం కెసిఆర్ ను సూటిగా ప్రశ్నించారు.