Saturday, November 23, 2024
HomeTrending Newsశ్రీలంకలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

శ్రీలంకలో ఆకాశాన్నంటిన నిత్యావసర ధరలు

ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న శ్రీలంక నెత్తిన మరో పిడుగు పడింది. ఉక్రెయిన్, రష్యా యుద్ధం ప్రభావంతో చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి. తాజాగా శ్రీలంకలో చమురు ధరలను పెంచుతున్నట్లు లంక ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ(LIOC) ప్రకటించింది. పొట్ట నింపుకోవడానికి పడరాని పాట్లు పడుతున్న లంకేయులకు చమురు, నిత్యావసర ధరలు షాక్‌ ఇస్తున్నాయి. ఇప్పటికే వంట నూనె ధరలు పెరిగి సామాన్యుడిని ఇబ్బందులకు గురిచేస్తోండగా తాజాగా పెట్రోల్, డీజిల్‌ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం శ్రీలంక ప్రజలను మరిన్ని ఇబ్బందుల్లో పడేసింది. ప్రస్తుతం రష్యా, ఉక్రెయిన్‌ దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ లో ముడిచమురు ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి అనుగుణంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ లంక ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ(LIOC) శ్రీలంకలో పెట్రోల్​, డీజిల్‌ ధరలను భారీగా పెంచింది.

పెట్రోల్​, డీజిల్​ ధరలు డబుల్​ సెంచరీని దాటేశాయి. ఈ మేరకు లీటర్ పెట్రోల్ ధర రూ.50, లీటర్ డీజిల్ ధర రూ.75 పెంచుతున్నట్లు తెలిపింది. ధరలను పెంచిన అనంతరం లీటర్ పెట్రోల్ ధర రూ.254కి చేరింది. లీటర్ డీజిల్ ధర రూ.214కి చేరింది. శ్రీలంకలో ఒకే నెలలో ఇంధన ధరలను పెంచడం ఇది మూడోసారి. తాజా ధరల పెంపుతో శ్రీలంకలో లీటర్ పెట్రోల్ ధర రూ.254, లీటర్ డీజిల్ ధర రూ.214 కి చేరింది.

శ్రీలంక రూపాయి భారీగా పతనమైంది. ప్రస్తుతం శ్రీలంక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ.57కి తగ్గింది. ఒక డాలర్ కు 260 శ్రీలంక రూపాయిగా ఉంది. శ్రీలంక రూపాయి పడిపోవడం వారం రోజుల్లో ఇది రెండోసారి. శ్రీలంక సర్కారు చమురు ధరలపై ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని.. తద్వారా అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో సంస్థ నష్టపోతోందని ఎల్‌ఐవోసీ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గుప్తా వివరణ ఇచ్చారు. 2003లో శ్రీలంక భారత మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం లంక ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ(LIOC) ద్వీప దేశంలో 211 పెట్రోల్ స్టేషన్ లను నిర్వహిస్తోంది. ఒక బ్రెడ్ ధర ఇప్పటివరకు 30 రూపాయలు ఉండగా తాజాగా 130 రూపాయలకు పెరిగింది. గోధుమ పిండి ధర వంద రూపాయల దరిదాపులకు చేరుకుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్