Sunday, March 8, 2026
HomeTrending Newsతెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు

తెలంగాణ‌లో ఒంటిపూట బ‌డులు

తెలంగాణ‌లో రేప‌ట్నుంచి (మార్చి 15) ఒంటిపూట బ‌డులు ప్రారంభం కానున్నాయి. అన్ని ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు పాఠ‌శాల‌ల్లో మంగ‌ళ‌వారం నుంచి ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ డైరెక్ట‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల వ‌ర‌కు ఒంటిపూట బ‌డులు కొన‌సాగ‌నున్నాయి. మ‌. 12:30 గంట‌ల‌కు మ‌ధ్యాహ్నం భోజ‌నం పెట్టి, విద్యార్థుల‌ను ఇంటికి పంప‌నున్నారు. ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు కొన‌సాగుతాయ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular