Saturday, November 23, 2024
HomeTrending Newsకీవ్ పై రష్యా భీకర దాడులు

కీవ్ పై రష్యా భీకర దాడులు

ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను కైవసం చేసుకునేందుకు రష్యా భారీగా విధ్వంసం సృష్టిస్తోంది. రష్యా భీకర దాడులతో కీవ్ ప్రజలు క్షణమొక యుగంగా కాలం వెళ్లదీస్తున్నారు. యుద్ధం మొదలై 21 రోజులు గడుస్తున్నా ఉక్రెయిన్ దారికి రాక పోవటంతో దాడులను తీవ్రతరం చేయాలని సైన్యానికి క్రెమ్లిన్  స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. రక్షణ స్థావరాలని ఇప్పటికే నేలమట్టం చేసిన రష్యా తాజాగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు భవంతుల పైనే క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 24వ తేదిన నాటో సమావేశం ఉండటం…దానికి అమెరికా అధ్యక్షుడు కూడా రానుండటంతో ఇక ఆలస్యం చేయోద్దనే ఆలోచనలో రష్యా ఉంది. ఇప్పటికే అమెరికా పై ఆంక్షలు విధించిన రష్యా ఇపుడు కెనడా ప్రధానమంత్రి ఆ దేశ మంత్రులు చట్ట సభ్యులపైనా ఆంక్షలు ప్రకటించింది.

మరోవైపు రష్యా ఆగకుండా దాడులు చేస్తుండటంతో- ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో 36 గంటల కర్ఫ్యూను ప్రకటించారు. పశ్చిమ దేశాల అండతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోద్మీర్ జేలేన్సకీ ఓ వైపు చర్చలు అంటూనే ఇంకోవైపు యుద్ధం ఆపేది లేదంటూ హుంకరిస్తున్నాడు. కీవ్ నగరంలోకి ప్రవేశించిన రష్యా బలగాలపై ఉక్రెయిన్ డ్రోన్ లతో దాడులు చేస్తూ నిలువరించే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలాండ్, చెక్ రిపబ్లిక్, స్లోవేకియా దేశా ప్రధానమంత్రులు ఈ రోజు కీవ్ లో జేలేన్సకీ తో సమావేశమయ్యారు. అటు బెలారస్ లో ఉక్రెయిన్ – రష్యా ల మధ్య నాలుగో రౌండ్ శాంతి చర్చలు జరుగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్