Monday, March 16, 2026
Homeసినిమాయాంటీ బికిలీ అంటే ఏమిటి?

యాంటీ బికిలీ అంటే ఏమిటి?

Bichagadu -2: విజయ్ ఆంటోనీని స్టార్ హీరోగా మార్చిన సినిమా ‘బిచ్చగాడు’. ఈ చిత్రానికి ప్రస్తుతం బిచ్చగాడు 2 పేరుతో సీక్వెల్ రూపొందుతోంది. ఈ సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై ఫాతిమా విజయ్ ఆంటోనీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడిగా మారుతున్నారు విజయ్ ఆంటోనీ. ఆయన దర్శకత్వంతో పాటు సంగీతాన్ని అందిస్తూ ఎడిటింగ్ బాధ్యతలూ వహిస్తుండటం విశేషం. కావ్య థాపర్ నాయికగా నటిస్తోంది. తాజాగా బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ను విడుదల చేశారు. ఆ థీమ్ సాంగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇచ్చింది.

ఈ థీమ్ సాంగ్ చూస్తే …’రోల్స్ రాయిస్ కారులో నుంచి స్టార్ హోటల్ దగ్గర దిగిన కథానాయకుడు అక్కడ బిచ్చగాడిలా మేకప్ వేసుకుంటాడు. ఆటోలో బయటకు వెళ్తాడు. అతను వెళ్తున్నది యాంటీ బికిలీ మిషన్ మీద అనేది తర్వాత తెలుస్తుంది. ఈ మిషన్ ఏంటి అనేది సినిమాలో చూడాలి. చరిత్రను సంపన్నులు రాశారు. పేదల బతుకులు వాళ్లకు తెలియదు. వస్తున్నాడు చరిత్రను మార్చి రాసేందుకు అంటూ యాంటీ బికిలీ లక్ష్యమేంటో థీమ్ సాంగ్ లో చెప్పేశారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ధర్మసంస్థాపనార్దయా సంభవామి యుగే యుగే శ్లోకం నేపథ్యంగా వినిపించింది. ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన బిచ్చగాడు 2 థీమ్ సాంగ్ ఆసక్తిరేపుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular