Saturday, November 23, 2024
Homeసినిమా'స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌' అభినందనీయం : అమ‌ల

‘స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌’ అభినందనీయం : అమ‌ల

Dance like Yoga: తెలంగాణ‌ సంస్కృతి సంప్ర‌దాయాల‌ను `స్టోరీస్ ఆఫ్ తెలంగాణ‌` డాక్యుమెంట‌రీ ద్వారా వెలుగులోకి తేవడం అభినంద‌నీయ‌మ‌ని అమ‌ల అక్కినేని అన్నారు. పేర్ని నృత్య రూప‌క‌ర్త డా. న‌ట‌రాజ రామ‌కృష్ణ 100వ జ‌యంతి సంద‌ర్భంగా 30 నిముషాల నిడివి గ‌ల‌ డాక్యుమెంట‌రీని ప‌లువురికి ప్ర‌ద‌ర్శించారు. ఇది కాన్సెప్ట్ క్రియేట‌ర్‌, సినిమాటోగ్రాఫ‌ర్  డి. స‌మీర్ కుమార్ ఆధ్వ‌ర్యంలో రూపొందింది. సుప్రియ యార్ల‌గ‌డ్డ దీనిని నిర్మించారు. ఈ సంద‌ర్భంగా అన్న‌పూర్ణ స్టూడియో మినీ థియేట‌ర్‌లో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి అమ‌ల హాజ‌ర‌య్యారు.

ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ “క్రమ‌శిక్ష‌ణ‌,  మ‌న‌లోని అంత‌ర్‌శ‌క్తికి డ్యాన్స్ ప్రక్రియ చ‌క్క‌టి ఫ్లాట్‌ఫామ్ లాంటిది. క‌ళ అనేది బ‌తికున్నంత కాలం డ్యాన్స్ వుంటుంది. రుక్ష్మిణీదేవి చెప్పిన‌ట్లు, డ్యాన్స్ అనేది యోగ లాంటిది. మ‌న‌లోని సామ‌ర్థ్యం, శ‌క్తిని వెలికితీయ‌డ‌మే కాకుండా జీవితంలో ఉన్న‌తంగా ఎలా వుండాల‌నేది తెలియ‌జేస్తుంది. చాలా మంది కంప్యూట‌ర్ ముందు కూర్చున్న‌వారు కానీ ఇత‌ర‌త్రా కానీ ప్ర‌స్తుతం ఒత్తిడికి గుర‌వుతున్నారు. ఇలాంటి వారు డ్యాన్స్ చేస్తే అద్భుతంగా యోగ చేసిన‌ట్లుగా వుంటుంది. నా వ‌య‌స్సు వారు చేయ‌లేక‌పోయినా యువ‌త ఇది అల‌వ‌ర్చుకోవాలి”

“డ్యాన్స్ పై డాక్యుమెంట‌రీ చేయ‌డం, అందులోనూ అన్న‌పూర్ణ స్టూడియోస్ దీన్ని  నిర్మించ‌డానికి ముందుకు రావ‌డం చాలా గొప్ప విష‌యం. మ‌న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను ఇప్ప‌టి జ‌న‌రేష‌న్ తెలియ‌జేసేలా స‌మీర్ చేసిన ప్ర‌యోగం అభినంద‌నీయం. ఇంత‌కు ముందు స‌మీర్ `మోక్ష‌` అనే షార్ట్ ఫిలిం చేశాడు. డ్యాన్స్‌, సినిమా అనేవి ఒక‌దానికి ఒక‌టి స‌మ‌న్వ‌యం అయివుంటాయి. నేను క‌ళాక్షేత్రంలో గ్రాడ్యుయేట్ చేస్తుండ‌గా, చాలా మంది సినిమా వైపు మొగ్గారు. నేను డ్యాన్స్‌ను సెల‌క్ట్ చేసుకున్నా”న‌ని తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్