Sunday, June 7, 2026
Homeసినిమావరలక్ష్మి నటించడానికి శరత్ కుమార్ ఒప్పుకోలేదట! 

వరలక్ష్మి నటించడానికి శరత్ కుమార్ ఒప్పుకోలేదట! 

Varalakshmi- Radhika: శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి ఇప్పుడు తమిళ .. తెలుగు సినిమాలతో బిజీగా ఉంది. లేడీ విలనిజం .. నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలకుగాను ముందుగా ఆమె పేరునే పరిశీలిస్తున్నారు. తెలుగులో  ‘తెనాలి రామకృష్ణ బీఎబీఎల్’ .. ‘నాంది’ .. ‘క్రాక్’ సినిమాలలోని పాత్రలు ఆమె నటనకు అద్దం పడతాయి. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘యశోద’తో పాటు బాలకృష్ణ – గోపీచంద్ మలినేని  కాంబినేషన్లోని సినిమా కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెను గురించి ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో రాధిక ప్రస్తావించారు.

“వరలక్ష్మి చాలా టాలెంటెడ్ .. ఏ పాత్రను ఇచ్చినా తాను చాలా అద్భుతంగా చేస్తుంది. వరలక్ష్మి సినిమాల్లోకి రావాలనుకున్నప్పుడు శరత్ కుమార్ ఒప్పుకోలేదు. ఆమె నటించడానికి ఆయన ఇష్టపడలేదు. అప్పుడు ఆయనను ఒప్పించింది నేనే. తమిళ సినిమాలతో పాటు  తెలుగు సినిమాలు చేయమనీ, ఎక్కువ ప్రశంసలు దక్కుతాయని తనకి నేనే చెప్పాను. ఇప్పటికీ తను అంటూ ఉంటుంది .. నేను చెప్పినట్టుగానే జరిగిందని. తను హైదరాబాద్ కి షిఫ్ట్ అయింది. ప్రస్తుతం ఇక్కడే ఉంటోంది. వాళ్ల నాన్న మాదిరిగానే తను చాలా బోల్డ్.

ఇప్పుడు కథలు .. పాత్రలు మారిపోయాయి. గతంలో మేము చేసిన తరహా పాత్రలు ఇప్పుడున్న హీరోయిన్స్ కి రావడం లేదు. ఇప్పుడున్న హీరోల్లో ఎన్టీఆర్ అంటే ఎక్కువ ఇష్టం. ఆయన సినిమాలను తప్పకుండా చూస్తుంటాను. ఆయన ఎనర్జీ లెవెల్స్  వేరుగా ఉంటాయి. నా మనవడికి కూడా ఎన్టీఆర్ అంటే ఇష్టం. అల్లు అర్జున్ .. చరణ్ నా కళ్లముందు పెరిగిన వాళ్లు. ఈ రోజున వాళ్ల పెర్ఫార్మెన్స్ చూస్తుంటే గర్వంగా అనిపిస్తుంది. కృష్ణగారితో కలిసి షూటింగ్స్ కి వచ్చేటప్పుడు మహేశ్ బాబు చాక్లెట్ బాయ్ లా ఉండేవాడు .. ఈ రోజున తను సూపర్ స్టార్” అంటూ చెప్పుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular