Saturday, November 23, 2024
HomeTrending Newsవెల్గనూరు విద్యార్థుల అత్యద్భుత ప్రతిభ

వెల్గనూరు విద్యార్థుల అత్యద్భుత ప్రతిభ

తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ లో జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల, వెల్గనూరు విద్యార్థుల అత్యద్భుత ప్రతిభ కనపరిచారు.
రాష్ట్రస్థాయిలో 4వ స్థానం. ఒక లక్ష యాభై వేలు క్యాష్ ప్రైజ్, బహుమతి అందజేసి అభినందించిన గౌరవ మంత్రి వర్యులు KTR, సబితా ఇంద్రారెడ్డి. ఈనెల మూడు, నాలుగు వ తేదీలలో హైదరాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి స్కూల్ lఇన్నోవేషన్ ఛాలెంజ్ గ్రాండ్ ఫైనల్ పోటీలలో మంచిర్యాల్ జిల్లా దండేపల్లి మండలం  జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల వెలగనుర్ గైడ్ టీచర్ వి వేణుగోపాల్ విద్యార్థులు అభిలాష్, లక్ష్మణ్,వినయ్ వర్మ, టి. అభిలాష్ బృందం తయారుచేసిన మైజ్ ఆన్ హీట్… మొక్కజొన్న కంకులు కాల్చే సులభ పరికరం రాష్ట్రస్థాయిలో అత్యత్తమ ప్రదర్శన కనపరిచి అందరి మెప్పును పొందింది.

ఈ రోజు (4వ తేదీ) నిర్వహింఛిన గ్రాండ్ ఫినాలేలో కల్వకుంట్ల రామారావు ఐటీ శాఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ మంత్రి, ఐటీ సెక్టరేటరీ సెక్రెటరీ జయేష్ రంజాన్, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ శ్రీమతి దేవసేన విద్యా శాఖ డైరెక్టర్గ చే అభినందనలు పొందారు. నాలుగో స్థానానికి ఎంపిక అయిన వేల్గానురు పాటశాలకు రాష్ట్రప్రభుత్వం తరపున బహుమతిగా ఒక లక్షా 50 వేల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది. భవిష్యత్తులో మార్కెట్లోకి ఈ పరికరాన్ని విడుదల చేసి అందరికీ ఉపయోగ పడేలా ముందుకు తీసుకొస్తాం అని మంత్రి KTR తెలియజేశారు. సామాజానికి పనికొచ్చే ఈ పరికరం అందరికీ చాలా ఉపయోగకరమైన పరికరం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విజయం పొందిన విద్యార్థులను, గైడ్ ఉపాధ్యాయుడు వేణుగోపాల్, ప్రధానోపాధ్యాయురాలు ఎల్ గాయత్రి లను   మరియు జిల్లా సైన్స్ అధికారి ని జిల్లా కలెక్టర్ భారతి హోళీ కేరి జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఖ్యాతిని రాష్ట్రా పతాక స్థాయిలో నిలిపిన అందరికి ప్రత్యేక అభినందనలు.

Also Read : గత స్మృతుల్లో కేటియార్

RELATED ARTICLES

Most Popular

న్యూస్