Monday, May 20, 2024
HomeTrending Newsకేంద్రం మెడలు వంచి కొనిపిస్తాం - తెరాస

కేంద్రం మెడలు వంచి కొనిపిస్తాం – తెరాస

పండిన పంటను కొనుగోలు చెయ్యాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్రప్రభుత్వం మీదనే ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.అటువంటి బాధ్యతల నుండి మోడీ సర్కార్ తప్పుకోవాలని చుస్తే మెడలు వంచి మరీ కొనుగోలు జరిపిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయడం లేదంటూ అందుకు వ్యతిరేకంగా మండల కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలంటూ టి ఆర్ యస్ చీఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం ఉరువాడ ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి సమన్వయం తో జిల్లాలోని టి ఆర్ యస్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మండల కార్యాలయాల ఎదుట రైతాంగం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.

అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన ప్రదర్శనలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పండిన పంటను కేంద్రం కొనుగోలు చేసేంత వరకు మొదలు పెట్టిన ఈ నిరసన ప్రదర్శనలు తెలంగాణ రాష్ట్రంలో మరో ఉద్యమానికి అంకురార్పణ చుట్టబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయ క్రీడలతో రైతాంగం నోట్లో మట్టి కొట్టొద్దని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి యాసంగిలో వరి వద్దని వారించిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. అందుకు భిన్నంగా వరినే వెయ్యాలంటూ ప్రోత్సహించింది బిజెపి కి చెందిన నేతలు కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పండిన ప్రతి గింజను కొనుగోలు చెయ్యాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆహార భద్రత చట్టం కుడా అదే చెబుతోందని ఆయన తేల్చిచెప్పారు.గడిచిన నాలుగు దశాబ్దాలుగా అదే జరుగుతోందని కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కుడా ఇంత కాలం అదే పద్ధతిని అవలంబించింది నిజం కాదా అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్