Friday, March 13, 2026
Homeసినిమాకార్తికేయ తో యువి క్రియేషన్స్ సినిమా

కార్తికేయ తో యువి క్రియేషన్స్ సినిమా

Karthikeya in UV: ‘ఆర్ఎక్స్-100’తో హీరోగా ప‌రిచ‌య‌మై.. తొలి సినిమాతోనే స‌క్సెస్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన యువ క‌థానాయ‌కుడు కార్తికేయ‌. ఆత‌ర్వాత హిప్పీ, గుణ 369, గ్యాంగ్ లీడ‌ర్, 90 ఎంఎల్, చావు క‌బురు చ‌ల్ల‌గా, రాజా విక్ర‌మార్క‌, వ‌లిమై చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు. ఇప్పుడు ప్రతిష్టాత్మక యు.వి.క్రియేషన్స్ నిర్మాణ సంస్థ నిర్మించే చిత్రంలో న‌టిస్తున్నాడు. కార్తికేయ, ఐశ్వర్య మీనన్ జంటగా ప్రశాంత్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక పోస్టర్ దర్శక నిర్మాతలు విడుదల చేశారు. తనికెళ్ల భరణి, రవిశంకర్, శరత్ లోహితస్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు శ్రీనివాస్ మాటలు అందిస్తున్న ఈ సినిమాకు.. సత్య జి ఎడిటర్. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular