Sunday, June 14, 2026
Homeసినిమా‘కృష్ణ వ్రింద విహారి' నుంచి 'వర్షంలో వెన్నెల' పాట విడుదల 

‘కృష్ణ వ్రింద విహారి’ నుంచి ‘వర్షంలో వెన్నెల’ పాట విడుదల 

Varshamlo Vennela:  యంగ్ అండ్ డైనమిక్ హీరో నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న ‘కృష్ణ వ్రింద విహారి‘ మ్యూజికల్ జర్నీ గ్రాండ్ గా మొదలైయింది. ఈ చిత్రంలోని మొదటి పాట ‘వర్షంలో వెన్నెల’ని సౌత్ క్వీన్ సమంత విడుదల చేశారు. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాట ప్రేక్షకులని అలరిస్తుంది. ఈ పాటలో నాగ శౌర్య, షిర్లీ సెటియా మధ్య కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. పాటని కూల్ అండ్ రొమాంటిక్ గా చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది.
హీరో, హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీతో పాటు పాటలో విజువల్స్ చాలా లావిష్ గా వున్నాయి. శ్రీమణి అందించిన సాహిత్యం కూడా వర్షంలో వెన్నెలంతా హాయిగా వుంది. పాట ఇంటర్ల్యుడ్ లో వినిపించిన వీణ స్కోర్ మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా వుంది. పాట పాడిన సంజన కల్మంజే, ఆదిత్య ఆర్కే ఇద్దరూ తమ వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.
డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా, తమ్మిరాజు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రాధిక ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘వర్షంలో వెన్నెల’ పాట సినిమాపై మరిన్ని అంచనాలని పెంచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular