Tuesday, March 10, 2026
Homeతెలంగాణఅడిషనల్ కలెక్టర్లకు కియా కార్లు

అడిషనల్ కలెక్టర్లకు కియా కార్లు

తెలంగాణా ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్లకు సరికొత్త కియా మోడల్  కార్లు అందజేసింది. ఈరోజు ప్రగతి భవన్ లో ఇవాళ ప్రగతి భవన్ లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల (డిపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై ముఖ్యమంత్రి కేసియార్ సమీక్ష నిర్వహించారు. ఆ సందర్భంగానే వారికి మొత్తం 32 కియా కార్నివాల్ వాహనాలు అందజేశారు.  ఆర్టీఏ ద్వారా కొనుగోలు చేసిన వాహనాలను సిఎం చేతుల మీదుగా అప్పగించారు.

సమీక్ష సందర్భంగా సిఎం కెసియార్ అడిషనల్ కలెక్టర్లకు తగిన గౌరవం ఇస్తామని, జిల్లా కలెక్టరు కార్యాలయాల్లో, కలెక్టరు ఆఫీసు రూమ్ పక్కనే అదనపు కలెక్టర్ల కార్యాలయాలు కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వారికి ప్రోటోకాల్ గౌరవాన్నిమరింత పెంచుతామని చెప్పారు.  ఇలా హామీ ఇచ్చిన కాసేపటికే ఈ వాహానాలు వారికి అందించడం విశేషం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular