Sunday, November 3, 2024
HomeTrending Newsరాజకీయ సుడిగుండంలో ఇమ్రాన్ ఖాన్

రాజకీయ సుడిగుండంలో ఇమ్రాన్ ఖాన్

Politics Imrankhan : పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖేల్ ఖతమ్ అయినట్లేనా? పాక్ రాజకీయాలను తిరగ రాసేస్తానని మార్చేస్తాననీ గద్దెనెక్కిన ఇమ్రాన్ అత్యంత అవమానకర రీతిలో పతనం దిశగా అడుగులేస్తున్నారా? రాజకీయాల్లో ఇమ్రాన్ ఫెయిల్యూర్ అనుకోవాలా? రికార్డులు బ్రేక్ చేసిన ఈ క్రికెటర్ పొలిటికల్ మ్యాచ్ లో మాత్రం జీరోగా మిగిలిపోయారా? అసలు ఇమ్రాన్ స్వభావం ఎలాంటిది? ఇమ్రాన్ పర్సనల్ కెరీర్ ని ఒకసారి స్కాన్ చేద్దాం. పతనపుటంచుల్లో ఉన్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పాకిస్థాన్ మీడియాలో ఓ రేంజ్ లో జోక్ లు పేలుతున్నాయి. ఇమ్రాన్ పై విపక్షాలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి.

పాకిస్థాన్ తల రాతను మార్చేస్తానని గద్దనెక్కిన ఇమ్రాన్ ఇప్పుడు అత్యంత అవమానకర రీతిలో పతనం దిశగా అడుగులు వేస్తున్నాడు. పాకిస్థాన్ చరిత్ర ఇమ్రాన్ ను మొన్నటి వరకూ ఒక గొప్ప క్రికెటర్ గా గుర్తుంచుకునేది.. కానీ నేడు మారిన పరిణామాలు ఇమ్రాన్ ను ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ గా మిగిల్చాయి. పాక్ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన ఈ క్రికెటర్ ఇప్పుడు ఉత్కంఠభరిత పొలిటికల్ మ్యాచ్ లో తనంత తానే హిట్ వికెట్ చేసుకున్నాడు. పాక్ రాజకీయాల్లో ఆయనొక ప్రైమ్ టైమ్ జోక్ గా మారిపోయాడు. టాబ్లాయిడ్లకు కావలసినంత స్టఫ్ ఇచ్చే జోకర్ గా మిగిలిపోయాడు. పాకిస్థానీ సంపన్నభూస్వాముల పష్తున్ కుటుంబంలో పుట్టిన ఇమ్రాన్ ఆట్కిసన్ కాలేజ్ లో చదువుకున్నాడు. ఆపై ఇంగ్లండలోని వర్పెస్టర్ గ్రామర్ స్కూల్, ఆక్స్ ఫర్డ్ కేబుల్ కాలేజ్ లో పై చదువులు చదివాడు ఆక్స్ ఫర్డ్ లో ఉండగానే 1973-1975 కాలంలో ఆక్స్ ఫర్డ్ బ్లూస్ క్రికెట్ టీమ్ సభ్యుడిగా ఉన్నాడు. ఇంగ్లండ్ లోని ఎడ్జ్ బాస్టన్ లో 1971లో ఖాన్ క్రికెట్ కెరీర్ మొదలైంది.1974లో వన్డే క్రికెట్ ఫీల్డ్ లోకి ఇంగ్లాండ్ ఆపోజిట్ టీమ్ లో అడుగు పెట్టాడు. 1976లో పాకిస్థాన్ కు తిరిగొచ్చాక పాక్ జాతీయ క్రికెట్ టీమ్ లో చోటు సంపాదించాడు. అప్పటినుంచి ఇమ్రాన్ ఆట ఒక సెన్సేషన్ అద్భుతమైన క్రికెటర్ గా రాణించి పాకి్స్థాన్ కి వాల్డ్ కప్ కూడా సాధించాడు. ఎన్నెన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.

ఇమ్రాన్ కు ఉన్న గ్లామర్ వల్ల ప్లేబోయ్ గా కూడా పేరు పడ్డాడు. అమ్మాయిలకు ఆరాధ్య దైవంగా మారిన ఇమ్రాన్ ఎందరితోనో డేటింగ్ లు, ఫ్రెండ్ షిప్ లు కొనసాగించాడు. మోస్ట్ రొమాంటిక్ హీరో గా అమ్మాయిలు ఆరాధించేవారు. క్రికెట్ ఆట తెచ్చిన పేరు, ఇచ్చిన సంపద అత్యంత విలాసవంతమైన జీవితానికి బాటలు పరిచింది. కోరుకున్న అమ్మాయిలతో కోరినంత కాలం ఫ్రెండ్ షిప్ లు, డేటింగ్ లు చేసేదాకా వళ్లింది. చివరకు జెమీమా గోల్డ్ స్మిత్ అనే బ్రిటీషర్ ని పెళ్లాడాడు.. వీరి వివాహ బంధం ఎన్నాళ్లో నిలవలేదు మోడ్రన్ గా ఉండే జెమీమా తీరుపై పాకిస్థాన్ సంప్రదాయ వర్గాలనుంచి ఎదురైన వ్యతిరేకత కాలక్రమంలో జెమీమాతో తెగదెంపులు చేసుకునేదాకా వెళ్లింది. ఆతర్వాతే ఇమ్రాన్ రాజకీయాలవైపు సీరియస్ గా అడుగులు వేశాడు. ఆ తర్వాత కొంత కాలానికి రెహం ఖాన్ అనే మరో జర్నలిస్టును మహిళను పెళ్లాడాడు. ఈ బంధమూ ఎక్కువ కాలం నిలవ లేదు.. ముచ్చటగా మూడో సారి తన ఆధ్యాత్మిక గురువు బుష్రా బీబీ అనే మహిళను పెళ్లాడాడు.. బుష్రా బీబీ ముస్లిం సంప్రదాయ జీవన విధానం, వేషధారణ ఇమ్రాన్ ఖాన్ పై ఉన్న వ్యతిరేకతను తుడిచి పెట్టేసింది. 2018లో ఇమ్రాన్ పాకిస్థాన్ ప్రధానిగా పగ్గాలు చేపట్టాడు. పాకిస్థాన్ రాజకీయాల తీరునే మార్చేస్తానని రంగంలోకి దిగాడు. కానీ గద్దెనెక్కిన దగ్గర నుంచి అటు సైన్యంతోనూ, ఇటు విపక్షాలతోనూ దోబూచులాటలకే పరిమితమయ్యాడు. ఇచ్చిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదు సరికదా. పాకిస్థాన్ ను అప్పుల కుప్పగా మార్చేసిన ఫెయిల్యూర్ ప్రధానిగా ముద్ర పడ్డాడు. ఇప్పుడు పతనపుటంచుల్లో ఉన్న ఇమ్రాన్ కెరీర్ మళ్లీ రివైవ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. పాకిస్థాన్ పొలిటికల్ గ్రౌండ్స్ లో ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ ముగిసినట్లే కనిపిస్తోంది.

ఇమ్రాన్ ఖాన్ కు ప్రాణహాని ఉందని పాకిస్తాన్ అంతరంగిక శాఖ మాజీ మంత్రి షేక్ రషీద్ పెషావర్ లో ఆందోళన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ రాజకీయాల్లో విదేశీ శక్తుల జోక్యం పెరిగిందని, వారి కనుసన్నల్లోనే పాకిస్తాన్ రాజకీయాలు నడుస్తున్నాయని రషీద్ పేర్కొన్నారు. ప్రధానమంత్రి పదవి నుంచి ఇమ్రాన్ ఖాన్ ను గద్దె దించిన విదేశీ శక్తులే ఆయనను హతమార్చే కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించే ఇమ్రాన్ ఖాన్ విదేశి శక్తులకు కంటగింపుగా మారాడని, తమ కనుసన్నల్లో ఉండేవారినే విదేశీ శక్తులు అధికారంలో ఉండనిస్తాయని షేక్ రషీద్ అన్నారు.

Also Read : పాక్ లో రాజకీయ అస్థిరత

RELATED ARTICLES

Most Popular

న్యూస్