Saturday, March 29, 2025
HomeTrending Newsజాబ్ మేళాకు రెండోరోజూ విశేష స్పందన

జాబ్ మేళాకు రెండోరోజూ విశేష స్పందన

YSRCP Job Mela: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాకు రెండోరోజు కూడా విశేష స్పందన లభించింది. వేలాది మంది నిరుద్యోగులు ఈ మేళాకు హాజరై తమ విద్యార్హతలకు అనుగుణంగా వివిధ కంపెనీల్లో ఉపాధి పొందారు. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీనేత వి. విజయసాయి రెడ్డి, పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

“తిరుపతి జాబ్ మేళా రెండో రోజు కూడా అదే స్పందనతో కొనసాగుతోంది. రాయలసీమలోని నలుమూలల నుంచి ఉద్యోగార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వారికి వివిధ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాలకు ఎంపిక చేస్తున్నారు” అంటూ విజయసాయి సోషల్ మీడియాలో తన సంతోషం పంచుకున్నారు.

 

RELATED ARTICLES

Most Popular

న్యూస్