Sunday, June 7, 2026
HomeTrending Newsవిజయవాడ ఆస్పత్రి ఘటనపై సిఎం సీరియస్

విజయవాడ ఆస్పత్రి ఘటనపై సిఎం సీరియస్

Immediate action: విజయవాడ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై అత్యాచార ఘటన వ్యవహారంలో  నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి ఆదేశించారు. ఎవరి నిర్లక్ష్యం ఉన్నా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని, బాధ్యులపై గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. ఈమేరకు సీఎంఓ అధికారులకు ఆదేశాలిచ్చారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని, ఆ కుటుంబానికి కూ.10 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విధుల్లో నిర్లక్ష్యం వహించారనే  ఆరోపణలున్న  నున్న సి‌ఐ హనీష్ కుమార్, ఎస్ఐ శ్రీనివాస్ ను  సస్పెండ్ చేశారు.

ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ కూడా చర్యలు ప్రారంభించింది,  విజయవాడ ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు. నిందితులు ఫాగింగ్‌ ఏజెన్సీకి చెందిన కార్మికులుగా గుర్తించి… వారిని విధులనుంచి తొలగిస్తున్నట్టుగా ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ ఆస్పత్రిలో సెక్యూరిటీ ఏజెన్సీకి, ఫాగింగ్‌ ఏజెన్సీకి టెర్మినేషన్‌ నోటీసు జారీ చేశారు. ఆర్‌ఎంఓకి షోకాజ్‌ నోటీసు జారీచేశారు. శాఖా పరంగా పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని మెడికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ను ఆదేశించారు. నివేదిక తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular