Key Deals : రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటిష్ ప్రధాని బోరీస్ జాన్సన్ ఈ రోజు (శుక్రవారం) న్యూఢిల్లీ చేరుకొన్నారు. రాష్ట్రపతి భవన్ లో ప్రధాని నరేంద్ర మోడీ… బోరిస్ జాన్సన్ కు ఘన స్వాగతం పలికారు. ఏడాదిన్నర కిందటే బ్రిటన్ ప్రధాని బోరిస్ జూన్సన్ భారత పర్యటనకు రావాల్సి ఉండగా..కరోనా, రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటి సంక్షోభాల నేపథ్యంలో పర్యటన వాయిదాపడుతూ వచ్చింది. ఈక్రమంలో గురువారం ఆయన భారత్ చేరుకున్నారు.
ఇండియా పర్యటనకు వచ్చిన తనకు అద్భుతమైన స్వాగతం తెలిపినందుకు బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ ధన్యవాదాలు చెప్పారు. ఇండియా, బ్రిటన్ మధ్య ఇప్పటి వరకు పరిస్థితులు బలంగా లేవన్నారు. ఇప్పుడున్నంత మంచిగా ఉన్నాయని తాను అనుకోవడం లేదని ఆయన చెప్పారు. రాష్ట్రపతి భవన్ చేరుకున్న తర్వాత బోరిస్ జాన్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్, ఆరోగ్య రంగానికి చెందిన పలు అంశాలపై ఇండియా, బ్రిటన్ మధ్య ఒప్పందాలు జరగనున్నాయి. ఈ ఒప్పందాల వల్ల 11 వేల ఉద్యోగాలు దక్కనున్నాయి. 5జీ టెలికాం, కృత్రిమ మేథ మొదలు ఆరోగ్య పరిశోధన, పునరుత్పాదన, ఇంధన వనరులు వంటి అనేక అంశాల్లో భారత, బ్రిటన్ లు ప్రపంచాన్ని నడిపిస్తున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. వాతావరణ మార్పులు, ఉక్రెయిన్ సంక్షోభం వంటి కీలక అంశాలపై కూడా జాన్సన్, మోడీ చర్చించే అవకాశం ఉంది.
Also Read :భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధానమంత్రి