Thursday, September 19, 2024
Homeసినిమామే20న వస్తున్న'శేఖ‌ర్‌'

మే20న వస్తున్న’శేఖ‌ర్‌’

May-Sekhar: డా. రాజ‌శేఖ‌ర్ న‌టించిన 91వ చిత్రం `శేఖ‌ర్‌`. జీవితా రాజశేఖర్ దర్శక‌త్వం వ‌హించారు.  క‌థ ప్ర‌కారం రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు. వంకాయలపాటి మురళీక్రిష్ణ సమర్పిస్తున్న ఈ చిత్రం పెగాసస్ సినీ కార్ప్, టారస్ సినీ కార్ప్, సుధాకర్ ఇంపెక్స్ ఐపీఎల్, త్రిపురా క్రియేషన్స్ పతాకాల పై రూపొందింది. బీరం సుధాకర్ రెడ్డి, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా, ఈ చిత్రం విడుద‌ల తేదీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మే 20న ఈ చిత్రం విడుద‌కానున్న‌ట్లు జీవితా రాజ‌శేఖ‌ర్ ప్ర‌క‌టించారు. వెంకట సాయి ఫిల్మ్ బ్యానర్ లో ముత్యాల రాందాస్ ఈ చిత్రానికి స‌హ‌క‌రిస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా జీవిత మాట్లాడుతూ “మాకెంతో స‌హ‌క‌రించిన నిర్మాతలు బీరం సుధాకర్ రెడ్డి, వెంకట శ్రీనివాస్ బొగ్గరం, వంకాయలపాటి మురళీక్రిష్ణ లకు ధన్యవాదాలు. ఈ చిత్రం. ప్రతి ఒక్కరి హృద‌యాల‌ను ట‌చ్ చేస్తుంది. కోవిడ్ వ‌ల్ల ప్ర‌తి కుటుంబం చాలా స‌ఫ‌ర్ అయిన ఎమోష‌న్స్‌ను ఈ చిత్రంలో చూస్తారు. రాజ‌శేఖ‌ర్‌గారు న‌టించిన  గోరింటాకు, అక్కమొగుడు,మా అన్నయ్య, సింహారాశి వంటి ఎన్నో చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆదరించారు. ఇప్పుడు రాబోయే `శేఖ‌ర్‌` చిత్రం కూడా ఆయ‌న స్థాయిని పెంచేలా వుంటుంది. ఈ శేఖర్ సినిమా అనుకున్న టైంలో పూర్తి కావడానికి న‌టీన‌టులు, సాంకేతిక సిబ్బంది కృషి ఎంతో వుంది.  రాజ‌శేఖ‌ర్‌గారు కొత్త సినిమా లుక్ ప‌నిమీద వుండ‌డం వ‌ల్ల రాలేక‌పోయారు. త్వ‌ర‌లో ఆ సినిమా వివ‌రాలు కూడా తెలియ‌జేస్తాం” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్