Saturday, January 18, 2025
HomeTrending Newsనాటో కూటమిలో చేరనున్న స్వీడన్, ఫిన్లాండ్

నాటో కూటమిలో చేరనున్న స్వీడన్, ఫిన్లాండ్

రష్యా ఉక్రెయిన్ యుద్దంతో యూరోప్ దేశాల్లో మేధోమథనం మొదలైంది. ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటో కూటమిలో చేరాలని నిర్ణయించాయి. వచ్చే నెల 16 వ తేదిన ఈ రెండు దేశాలు నాటో కూటమిలో సభ్యత్వం కోసం దరఖాస్తు చేయనున్నాయి. నాటోలో చేరే అంశంపై స్వీడన్, ఫిన్లాండ్ దేశాల అధినేతలు సుదీర్గంగా మంతనాలు జరుపుతున్నారు. రెండు దేశాలు కలిసే సభ్యత్వానికి దరఖాస్తు చేసే అవకాశం ఉంది. గత నెల రోజులుగా సభ్యత్వంపై చర్చ జరుగుతున్నా వారం రోజుల నుంచి ఉన్నతస్థాయిలో ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఐరోపా దేశాల్లో ఇప్పటికే అన్ని దేశాలు నాటో కూటమిలో చేరగా స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు మాత్రం తటస్థంగా ఉన్నాయి.

గత వారం రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మరియా జాఖరోవ ప్రకటన స్వీడన్, ఫిన్లాండ్ దేశాల వైఖరిలో మార్పుకు కారణంగా భావిస్తున్నారు. స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు నాటోలో చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి హెచ్చరించటం చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం ఉక్రెయిన్ కు పట్టిన గతే తమకు పడుతుందని రెండు దేశాల్లో చర్చోపచర్చలు జరిగాయి. ఇక ఆలస్యం చేయకుండా నాటోలో చేరాల్సిందేనని రెండు దేశాలు నిర్ణయించాయి.

అయితే దీనంతటికి అమెరికా కారణం అనటంలో ఏ మాత్రం అనుమానం అక్కరలేదు. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ చెల్లింపుల్లో డాలర్ తో మారకం తగ్గింది. వివిధ దేశాలు తమ అవసరాలకు అనుగుణంగా వ్యాపార చెల్లింపుల్లో ఆయా దేశాల కరెన్సీని వాడుతున్నాయి. ఇప్పటికే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న ఇండియా రూబుల్స్ లోని చెల్లించింది. దీంతో తన ప్రాభవం కాపాడుకునేందుకు అమెరికా తటస్థంగా ఉన్న దేశాలు తన వైపు ఉండే విధంగా ఎత్తుగడలు వేస్తూ భయాందోళనలు సృష్టిస్తోంది. ఇందులో భాగంగానే స్కాండినేవియన్ దేశాలైన స్వీడన్, ఫిన్లాండ్ లు నాటో వైపు మొగ్గు చూపుతున్నాయి.

Also Read : జో బిడెన్ కు దన్నుగా అమెరికా సెనెట్

RELATED ARTICLES

Most Popular

న్యూస్