Sunday, November 3, 2024
HomeTrending Newsసౌదీలో షాబాజ్ షరీఫ్ కు నిరసనల సెగ

సౌదీలో షాబాజ్ షరీఫ్ కు నిరసనల సెగ

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ కి రెండు రోజులుగా సౌదీఅరేబియాలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. మదీనాలో గురువారం ప్రార్థనలకు వెళ్ళినపుడు చోర్ చోర్ అంటూ కొందరు పాకిస్తానీలు షాబాజ్ బృందం వెంట పడ్డారు. పాకిస్తాన్ లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి వచ్చారని విమర్శలు చేశారు. గురువారం నినాదాలు చేసిన వారిపై సౌదీఅరేబియా ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. అయితే రంజాన్ చివరి శుక్రవారం కావటంతో నిన్న మధ్యాహ్నం ప్రధాని షాబాజ్ షరీఫ్ నమాజు చేసేందుకు మళ్ళీ వెళ్ళగా అవే నినాదాలు హోరెత్తాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య వెళ్ళినా షాబాజ్ కు నిరసనల సెగ తప్పలేదు.

మదీనాలోని మసీదులో షాబాజ్ వెంటపడుతున్న జనం.. చోర్ చోర్ అంటూ చేస్తున్న నినాదాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్తానీలు రోజా సమయంలో మసీదుల్లో క్రమశిక్షణ ఉల్లంఘించారని సౌదీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి పదవి చేపట్టాక మొదటగా సౌదీఅరేబియా పర్యటనకు వచ్చారు. మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన షాబాజ్…. మంత్రులు, అధికారులు, వ్యాపారులు ఇలా అనేక వర్గాలతో కూడిన భారీ ప్రతినిధి బృందంతో రియాద్ చేరుకున్నారు. షాబాజ్ కుటుంబానికి మొదటి నుంచి సౌది రాచ కుటుంబం అండగా ఉంటోంది. నవాజ్ షరీఫ్ పై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు పాక్ నుంచి లండన్ వెళ్లేందుకు సౌది రాచ కుటుంబమే సహకరించింది. ఇప్పుడు ప్రధాని పదవి చేపట్టాక…పాక్ దేశానికి ఆర్థిక సాయం కోసం షాబాజ్ వచ్చారు.

Also Read : పాక్ జాతీయ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు

RELATED ARTICLES

Most Popular

న్యూస్