Monday, February 24, 2025
Homeసినిమా16 భాషల దర్శకులకు దాసరి పురస్కారాలు

16 భాషల దర్శకులకు దాసరి పురస్కారాలు

Dasari Awards:  భారతదేశంలోని వివిధ ప్రాంతీయ, హిందీ భాషలలో గుర్తింపు పొందిన 16 మంది చిత్ర దర్శకులకు దాసరి నారాయణరావు 75 వ జయంతిని పురస్కరించుకొని సత్కరించనున్నట్లు దాసరి కల్చరల్ ఫౌండేషన్ చైర్మన్ తాటివాక రమేష్ నాయుడు తెలిపారు. మే 4 సాయంత్రం జరిగే ఈ కార్యక్రమంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శకులను సత్కరించుకోవటంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమంలో  తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఫెడరేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారని నిర్వాహకులు  తెలిపారు.

ఫిలిం అండ్ టెలివిజన్ ప్రమోషన్ కౌన్సిల్-తెలుగు సినిమా వేదిక  సమన్వయంతో అంగరంగ వైభవం గా జరిగే ఈ కార్యక్రమ కమిటీకి  తాడివాక రమేష్ నాయుడు చైర్మన్ గా, జి.నెహ్రు, చైతన్య జంగ  కో ఆర్డినేటర్స్ గా  విజయ్ వర్మ పాకలపాటి కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఫిలింఛాంబర్ లో జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో రమేష్ నాయుడు, నెహ్రు, చైతన్య జంగ, విజయ్ వర్మ పాకలపాటి  తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్