Monday, June 29, 2026
Homeసినిమా‘దర్జా’ మూడో పాట విడుదల

‘దర్జా’ మూడో పాట విడుదల

3rd Darjaa: కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో రూపొందుతోన్న ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ని యాక్షన్ కింగ్ అర్జున్, టీజర్‌ని ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, మొదటి పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, రెండో పాటని మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఇటీవలే ఆవిష్కరించారు. అవి ప్రేక్షకుల నుండి ట్రెమండస్ రెస్పాన్స్‌ని సొంతం చేసుకున్నాయి. తాజాగా చిత్రంలోని మూడో పాటని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ యెర్నేని చేతుల మీదుగా చిత్రయూనిట్ తాజాగా విడుదల చేసింది.

పాట విడుదల అనంతరం నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ..  ‘దర్జా’ చిత్రంలోని మూడో పాటను విడుదల చేయడం జరిగింది. పాట చాలా బాగుంది. ఈ పాట చూస్తుంటే సినిమా చాలా గ్రాండ్‌గా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు ఆల్ ద బెస్ట్. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అయ్యి, యూనిట్‌కి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత శివశంకర్ పైడిపాటి, చిత్ర సమర్పకులు కామినేని శ్రీనివాస్, కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌ రవి పైడిపాటితో పాటు స్ర్కిఫ్ట్‌ కో-ఆర్డినేటర్ పురుషోత్తపు బాబీ, సంగీత దర్శకుడు రాప్‌రాక్ షకీల్, రైటర్ భవానీ ప్రసాద్, హీరోయిన్ అక్సాఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ‘దర్జా’ మోషన్ పోస్టర్ ఆవిష్క‌రించిన యాక్షన్ కింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular