Saturday, November 23, 2024
HomeTrending Newsసాంస్కృతిక వైవిధ్యమే భారతీయుల బలం - ప్రధాని మోడీ

సాంస్కృతిక వైవిధ్యమే భారతీయుల బలం – ప్రధాని మోడీ

మూడు రోజుల యూరోప్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నిన్న డెన్మార్క్‌ చేరుకున్నారు. డెన్మార్క్ రాజధాని కొపెన్‌హగన్‌లో ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్‌సన్‌తో మోదీ భేటీ అయ్యారు. ఈ భేటీలో భారత్-డెన్మార్క్ ద్వైపాక్షిక సంబంధాలతో పాటు గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్య ఒప్పందం పురోగతిపై సమీక్ష జరిపారు. డెన్మార్క్ తో పలు రంగాల్లో ఒప్పందాలు చేసుకున్న తర్వాత రెండు దేశాల ప్రధానమంత్రులు మాట్లాడారు. భారత్-ఫసిఫిక్ తో పాటు.. ఉక్రెయిన్ ఇష్యూపైన చర్చించినట్టు మోడీ చెప్పారు. భారత్ లో మౌలిక వసతుల రంగంలో, గ్రీన్ ఇండస్ట్రీస్ లో పెట్టుబడులకు చాలా అవకాశాలు ఉన్నాయన్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయబోతున్నట్టు డానిష్ ప్రధానమంత్రి మెట్ ఫ్రెడరిక్‌సన్‌ చెప్పారు .

కొపెన్‌హాగన్‌లోని ప్రధాని నివాసంలో ఈ సమావేశం జరిగింది. బ్యాక్‌యార్డ్‌లో నడుస్తూ ఇద్దరు ఏకాంతంగా చర్చలు జరిపారు. భారత్‌-డెన్మార్క్‌ ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించారు. అనంతరం ప్రతినిధుల స్థాయి సమావేశం జరిగింది. ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగన్ లో భారతీయ ప్రవాసులతో సంభాషించారు. తన ప్రసంగంలో సమ్మిళితతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఉద్బోధించారు. భాష ఏదైనా సరే మన సంస్కృతి భారతీయమే అన్నారు.

సమగ్రత, సాంస్కృతిక వైవిధ్యం భారత దేశం బ‌ల‌మ‌ని, ‘వసుధైవ కుటుంబం’-ఒకే ప్రపంచాన్ని విశ్వసిస్తామని ప్రధాని మోదీ అన్నారు. భారతదేశ విస్తారమైన వైవిధ్యం కారణంగా..  ప్రజలు వేర్వేరు ఆహార ఎంపికలు,  భాషలను కలిగి ఉండవచ్చు, కానీ భారతీయులంతా ఒకే సంస్కృతిని కలిగి ఉంటారని ఆయన పేర్కొన్నారు.

నేడు భారతదేశం ఏదైతే సాధిస్తుందో.. అది మానవాళిలో ఐదవ వంతు సాధించిన విజయమని అన్నారు. అలాగే..  ప్రధాని మోదీ తన ప్రసంగంలో వాతావరణ మార్పు, పర్యావరణం, గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ గురించి కూడా మాట్లాడారు.  వాతావరణ మార్పులను పరిష్కరించడానికి లైఫ్- లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని చెప్పాడు. వినియోగాన్ని దృష్టిలో ఉంచుకునే విధానానికి స్వస్తి చెప్పాలని,  మన అవసరాలను బట్టి నిర్ణయించాలని ఆయన అన్నారు.

Also Read : సెమీకండక్టర్ సప్లయ్ చైన్ లో భారత్ కీలకం 

RELATED ARTICLES

Most Popular

న్యూస్