Babu for Amaravathi: చంద్రబాబు ప్రేమ ఎప్పటికీ అమరావతి మీదే ఉంటుందని… విశాఖకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో బాబు రాజీనామా చేయిస్తే ఇక్కడి ప్రజల తీర్పు ఏమిటో తెలుస్తుందని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అన్నారు. విశాఖకు పాలనా రాజధాని వద్దని బాబు చెబుతుంటే ఆ పార్టీ నేతలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్ ఐరన్ లెగ్ అంటూ బాబు చేసిన వ్యాఖ్యలను అవంతి తప్పు బట్టారు. ఎవరిది ఐరన్ లెగ్ అనేది అందరికీ తెలుసన్నారు. విజయసాయి విశాఖలో ఏం దోచుకున్నారో బాబు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.