Job Mela: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటివరకూ నిర్వహించిన జాబ్ మేళాల ద్వారా మొత్తం 30,473 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని, 347 కంపెనీలు పాల్గొన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. మూడవ జాబ్ మేళాను నేటి (7వ తేదీ) నుంచి ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. దీనిలో దాదాపు 26,300 ఉద్యోగాల భర్తీ లక్ష్యంగా పెట్టుకున్నామని, 210 కంపెనీలు హాజరవుతున్నాయని వివరించారు.
సిఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఖాళీగా ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసమే జాబ్‌మేళాలకు శ్రీకారం చుట్టామని…. తొలి జాబ్‌మేళా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో, రెండోది విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జరగ్గా, ఇప్పుడు మూడో కార్యక్రమం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ విడతలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అవకాశం కల్పిస్తున్నామని, పార్టీ వెబ్‌సైట్‌లో ఇప్పటికే 97 వేల మంది రిజిస్టర్ చేసుకున్నారని చెప్పారు. ఈ మేళాలో బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఐటీ, రీటెయిల్ లాజిస్టిక్, ఫార్మా, నిర్మాణ రంగ , హెల్త్ కేర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటొమొబైల్, ఎడ్యుకేషనల్ సర్వీసెస్, మార్కెటింగ్ అండ్ సేల్స్ సర్వీసెస్ తదితర రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు.
జాబ్‌మేళాలో ఉద్యోగాలు రాని వారు ఏ మాత్రం నిరాశ చెందొద్దని, రికి స్కిల్ డెవలప్‌మెంట్‌లో శిక్షణ ఇప్పించి వారికోసం భవిష్యత్తులో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తామని భరోసా ఇచ్చారు. ష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.
Also Read : మూడు ప్రాంతాల్లో జాబ్ మేళాలు: విజయసాయి