సిబిఎస్ఈ 12 వ తరగతి మార్కుల ప్రణాళికను బోర్డు సుప్రీంకోర్టుకు సమర్పించింది. అటార్నీ జరనల్ కే కే వేణుగోపాల్ ఈ నివేదికను కోర్టుకు అందజేశారు.12 వ తరగతి ఫైనల్ మార్కులను 10, 11, తరగతుల్లో విద్యార్ధులు సాధించిన మార్కుల ఆధారంగా నిర్ణయిస్తామని బోర్డు తెలిపింది. 10 వ తరగతి నుంచి 30 శాతం, 11నుంచి 30 శాతం వెయిటేజ్ ఇస్తామని , 12 వ తరగతిలో ఇప్పటివరకూ నిర్వహించిన ప్రీ-బోర్డు పరీక్షల్లో సాధించిన మార్కులను ఆధారంగా మరో 40 శాతం వెయిటేజ్ మార్కులు కేటాయిస్తామని, జూలై 31 లోగా పూర్తి ఫలితాలు విడుదల చేస్తామని బోర్డు కోర్టుకు విన్నవించింది.
బోర్డు కేటాయించిన మార్కులతో సంతృప్తి చెదనివారు పరీక్షలకు హాజరయ్యే అవకాశం కూడా కల్పిస్తున్నామని బోర్టు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ రూపంలో తెలియజేసింది.