Saturday, November 23, 2024
HomeTrending Newsనాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

ఇంటర్మీడియెట్ పరీక్షలు రద్దుపై ఇంకా నిర్ణయం తీసుకోని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీచేసింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 18 ఇప్పటికే పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మరో 6 రాష్ట్రాలు పరీక్షలు నిర్వహించాయి. మిగిలిన 4 రాష్ట్రాలూ ఇప్పటివరకూ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కోవిడ్ నేపధ్యంలో సిబిఎస్ఈ నిర్వహించాల్సిన 12,10 వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రాలు తమ పరిధిలోని బోర్డుల ద్వారా నిర్వహించే ఇంటర్ పరీక్షలను రద్దు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ కొందరు భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు…ఆంధ్రప్రదేశ్, పంజాబ్, అసోం, త్రిపుర రాష్ట్రాలకు నోటీసులు ఇచ్చింది. కేరళ రాష్ట్రం ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు చేయలేదు, కేరళ రాష్ట్రానికి కూడా నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఈ నెల జూన్ 21 కి వాయిదా వేసింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్